iDreamPost
android-app
ios-app

Pushpa 2 Tickets: పుష్ప-2 టికెట్స్ వేలం పాట? ఇదేమి క్రేజ్ రా బాబు!

  • Published Nov 18, 2024 | 1:42 PM Updated Updated Nov 18, 2024 | 1:42 PM

Pushpa 2 Movie First Day First Ticket For Auction: పుష్ప 2 సినిమాకి సంబంధించి రోజుకో క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ సృష్టించిన సునామీని మనం చూస్తున్నాం. దానికి అదనంగా ఇంకో క్రేజీ వార్త ఒకటి వచ్చింది. పుష్ప 2 సినిమా టికెట్స్ వేలం వేయబోతున్నారు అని చెబుతున్నారు.

Pushpa 2 Movie First Day First Ticket For Auction: పుష్ప 2 సినిమాకి సంబంధించి రోజుకో క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ సృష్టించిన సునామీని మనం చూస్తున్నాం. దానికి అదనంగా ఇంకో క్రేజీ వార్త ఒకటి వచ్చింది. పుష్ప 2 సినిమా టికెట్స్ వేలం వేయబోతున్నారు అని చెబుతున్నారు.

  • Published Nov 18, 2024 | 1:42 PMUpdated Nov 18, 2024 | 1:42 PM
Pushpa 2 Tickets: పుష్ప-2 టికెట్స్ వేలం పాట? ఇదేమి క్రేజ్ రా బాబు!

పుష్ప 2 గురించి ఇన్నాళ్లు ఎన్ని వార్తలు వచ్చాయో చూశాం. ఎంత హైప్ క్రియేట్ చేశారో చూశాం. ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ హైప్ ఆకాశామంత అయ్యింది. పాట్నాలో పుష్పరాజ్ మేనియా చూశాం. ప్రస్తుతం సినిమా అభిమానులు అంతా ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సగటు సినిమా అభిమాని రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ఏ ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా.. కేవలం ట్రైలర్ తోనే సినిమా రిలీజ్ చేయచ్చు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పచ్చు. ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి ఇంకో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఆ వార్త వింటే ఇందేమీ క్రేజ్ రా సామీ.. హైప్ తోనే చంపేస్తారా అని అనకుండా ఉండలేరు. అయితే ఈ వార్త సినిమాకి సంబంధించి కాదులెండ్. సినిమా టికెట్స్ గురించి. అవును.. పుష్ప 2 మూవీ టికెట్స్ ని వేలం వేయబోతున్నారు అంట. అందుకు సంబంధించిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఆ వేలం కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

పుష్ప 2 సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ అయిన హైప్ గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు పుష్ప 2 సినిమా పాన్ ఇండియా.. కాదు పాన్ వరల్డ్ మూవీగా అవతరించింది. ట్రైలర్ చూసిన తర్వాత పుష్ప పాన్ వరల్డ్ సినిమా అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అంతా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటుంటే.. మధ్యలో టికెట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అందేటంటే.. పుష్ప 2 సినిమా టికెట్స్ ని వేలం ద్వారా విక్రయించనున్నారంట. అయితే అన్నీ టికెట్స్ కాదులెండి. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు అన్ని థియేటర్లలో తొలి టికెట్ ని వేలంపాట ద్వారా విక్రయించనున్నట్లు సమాచారం. ఏపీ- తెలంగాణలోని అన్నీ థియేటర్లలో పుష్ప 2 మూవీ తొలి టికెట్ ని ఇలా వేలం ద్వారా విక్రయిస్తారు అని చెబుతున్నారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు అని చెప్పాలి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. కాకపోతే ఈ విషయాన్ని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2కి ఉన్న బజ్ చూస్తే వేలంపాట నిర్వహించినా సూపర్ సక్సెస్ అవుతుంది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా స్పాన్ ఇంటర్నేషనల్ కి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని మూవీలో కూడా డైలాగ్ రూపంలో చూపించారు. ఒకవైపు ట్రైలర్ అన్నీ భాషల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. మరోవైపు పుష్ప 2 మూవీతో ఏం రికార్డులు బద్దలు కొట్టబోతున్నారా అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే లెక్కలు మొదలు పెట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత పుష్ప 2 టార్గెట్ కచ్చితంగా 2 వేల కోట్లకు పైమాటే అంటున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలో నిలిచిపోయే చిత్రం అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అటు నార్త్ లో కూడా పుష్ప 2 ప్రకంపనలు చూశాం. పాట్నాలో చేసిన ట్రైలర్ ఈవెంట్ కి ఏకంగా 2 లక్షల మంది వరకు హాజరయ్యారు. అంటే నార్త్ లో పుష్ప 2 సినిమా మరింత రీసౌండ్ చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది అని చెప్పచ్చు. పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ మాత్రమే అని సుకుమార్ ఊరికే చెప్పలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ మాటే గుర్తొస్తోంది. మరి.. పుష్ప 2 సినిమా టికెట్స్ ని వేలం వేయబోతున్నారు అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş