iDreamPost
android-app
ios-app

నాకు ప్రమాదం జరిగింది.. రష్మిక మందన్నా పోస్టు వైరల్!

  • Published Sep 09, 2024 | 9:46 PM Updated Updated Sep 09, 2024 | 9:46 PM

Rashmika Mandanna Shares Health Update: నేషనల్ క్రషి రష్మిక మందన్నా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు ప్రమాదం జరిగిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాక పలు విషయాలను పేర్కొంది.

Rashmika Mandanna Shares Health Update: నేషనల్ క్రషి రష్మిక మందన్నా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు ప్రమాదం జరిగిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాక పలు విషయాలను పేర్కొంది.

  • Published Sep 09, 2024 | 9:46 PMUpdated Sep 09, 2024 | 9:46 PM
నాకు ప్రమాదం జరిగింది.. రష్మిక మందన్నా పోస్టు వైరల్!

నేషనల్ క్రష్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. శ్రీవల్లి పాత్రలో తన నటనతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక ఓ ఆసక్తికరమైన పోస్టు చేసింది. అంతేకాక ఆమె అభిమానులకు అది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి..రష్మిక చేసిన ఆ షాకింగ్ పోస్టు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తాను చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాని రష్మిక తెలిపింది. గత నెల రోజులుగా యాక్టివ్ గా లేకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని ఈ బ్యూటీ పేర్కొంది. తనకు ఇటీవలే యాక్సిడెంట్ అయిందని నటి రష్మిక ఇన్ స్టా లో వెల్లడించారు. నెల రోజులుగా తాను యాక్టివ్ గా లేనని తెలిపింది. ఓ చిన్న ప్రమాదం జరగడమే అందుకు కారణమని పేర్కొంది. డాక్టర్ల సలహా మేరకు ఇంటి వద్దే ఉంటున్నానని తెలిపారు. త్వరలో మళ్లీ బిజీ అవుతానని, జీవితం చాలా విలువైనదని,జాగ్రత్తంగా ఉండండని తెలిపింది. రేపనేది ఉంటుందో లేదో తెలీదని, హ్యాపీగా జీవించండని ఇన్ స్టాలో పోస్టు పెట్టింది.

అలానే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము, ఎందుకంటే.. అది చాలా అనూహ్యమైనదని తెలిపింది.  అందుకే సంతోషంగా ఉండాలని తెలిపింది.దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో  ఫుల్ గా లడ్డులు తింటూ మరో అప్ డేట్ ఇస్తాన్ని ఫన్నీగా పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టీవ్ గా లేదు. గతంలో ఓ సారి.. రష్మిక తన పెంపుడు కుక్కతో ఒక అందమైన వీడియోను పంచుకుంది. అనంతరం చాలా రోజుల తరువాత తాజాగా తన ప్రమాదం గురించి  పోస్టు చేసింది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ‘పుష్ప 2 ది రూల్’, ‘ఛావా’, ‘సికిందర్’ సినిమాలు విడుదులకు సిద్ధంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఆమె ఆయుష్మాన్ ఖురానాతో ‘వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’లో కూడా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక అవి కాకుండా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’, ‘కుబేర్’ వంటి మరో మూడు చిత్రాల పేర్లు చర్చలో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో కలసి రష్మిక రొమాన్స్ అదరగొట్టింది. మొత్తంగా రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss