Swetha
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ , ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా రకరకాల రీల్స్, ప్లేస్ తో సంబంధం లేకుండా .. చుట్టూ ఉన్నవాళ్లను పట్టించుకోకుండా మరి రీల్స్ షూట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చివరికి ఎయిర్పోర్ట్ లో కూడా..
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ , ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా రకరకాల రీల్స్, ప్లేస్ తో సంబంధం లేకుండా .. చుట్టూ ఉన్నవాళ్లను పట్టించుకోకుండా మరి రీల్స్ షూట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చివరికి ఎయిర్పోర్ట్ లో కూడా..
Swetha
ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ వస్తుంది. ఇక మారుతున్న ట్రెండ్ కు తగినట్లే యూత్ కూడా దానికి అట్ట్రాక్ట్ అవుతూ వస్తున్నారు. ఇక ఎప్పుడైతే సోషల్ మీడియాలో టిక్ టాక్ , ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ లాంటివి మొదలయ్యాయో.. యూత్ క్రమ క్రమంగా వాటికీ అట్ట్రాక్ట్ అవుతూ.. వాళ్ళ వాళ్ళ టాలెంట్ ను అందరికి చూపించాలనుకుంటూ.. పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ.. డాన్స్ వేస్తూ.. వీడియోస్ రికార్డ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మెట్రో ట్రైన్స్ లో, బస్సుల్లో, రద్దీగా ఉన్న ట్రాఫిక్ లో ఇలా ఎక్కడపడితే అక్కడ వీడియోస్ చేసినవారిని చూసాం. ఇక ఇప్పుడు వీరి వింతలు ఎయిర్పోర్ట్ వరకు చేరాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా ఎయిర్పోర్ట్ లో బ్యాగేజ్ కన్వేయర్స్ బెల్ట్ పై .. ప్రయాణికుల లగేజస్ వస్తూ ఉంటాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఓ యువతి అదే బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్ పై .. పడుకుని కొంచెం దూరం అదే బెల్ట్ పై ప్రయాణించింది. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఒక పాట యాడ్ చేసుకుని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా దానికి సోషల్ మీడియాలో 32లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పైగా కొందరు “ఈ వైరస్ ఎయిర్పోర్ట్ కు కూడా చేరింది” అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు మెట్రోలలో, రద్దీగా ఉండే ట్రాఫిక్ లో, బస్సులలో వీడియోస్ చేసేవారిని ఎంతో మందిని చూస్తూనే ఉన్నాము. అలాగే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ .. పబ్లిక్ డిమాండ్ చేయడం .. అధికారులు అలాంటి వారిని హెచ్చరించడం. ఇలా ఎన్నో జరిగాయి. అయినా కూడా.. యువత ఏ మాత్రం శ్రద్ద లేకుండా.. రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. హద్దులు దాటి పబ్లిక్ లో ప్రవర్తిస్తున్నారు . ఇంకా ఇటువాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ.. చాలా మంది ఆ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది, మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH
— desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024