Krishna Kowshik
ఇప్పుడంతా అపార్ట్ మెంట్ కల్చర్. పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు వచ్చి చేరాయి. దుస్తులు ఆరేసుకోవాలన్నా, పిల్లలతో సరదాగా గడపాలన్నా టెర్రస్ మీదకు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ ఊహించని విధంగా..
ఇప్పుడంతా అపార్ట్ మెంట్ కల్చర్. పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు వచ్చి చేరాయి. దుస్తులు ఆరేసుకోవాలన్నా, పిల్లలతో సరదాగా గడపాలన్నా టెర్రస్ మీదకు వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ ఊహించని విధంగా..
Krishna Kowshik
ఈ ఫోటోను చూసి ఇటీవల యువతీ యువకులు..రీల్స్ పిచ్చిలో పడి డేంజర్ స్టంట్ చేసిన విషయం గుర్తుకు రావడం ఖాయం. ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేయడంతో వైరల్ అయ్యింది. నెటిజన్లు తిట్టిపోశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మహారాష్ట్రలోని పూణె పోలీసులు అరెస్టు కూడా చేశారు. తిక్క తిన్నగా అయ్యింది అనుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసి ఎన్ని సార్లు చెప్పినా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇలాంటివి చేయడం మానేయరు అని అనుకుంటున్నారేమో.. ఫోటో చూసి జడ్జ్ చేయకండి. అసలు మేటర్ ఏంటంటే.. ఇది స్టంట్ కాదు.. రీల్స్ అంతకన్నా కాదు. ఇది రియల్ శాడ్ ఇన్సిడెంట్. ఓ మహిళ సబ్సుపై కాలు వేసి భవనంపై నుండి పడిపోయింది.
ఈ క్రమంలో భర్త ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది. ఆమె కింద పడింది. తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని నగరి బెంగళూరులో జరిగింది. సాధారణంగా బట్టలు ఆరేసేటప్పుడు లేదా ఎవరైనా వచ్చినప్పుడు మెడపై నుండి ఒంగి చూస్తూ.. కింద పడిపోయిన ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. తాజాగా ఓ మహిళ ప్రమాదవ శాత్తూ సబ్బుపై జారి పడి.. భవనంపై నుండి కింద పడిపోబోయింది. అంతలో ఆమెను భర్త పట్టుకున్నాడు. కొంత సేపు భార్యను పట్టుకోగలిగాడు. కానీ ఆమెను ఆపలేకపోయాడు. దీంతో ఆమె జారి కింద పడిపోయింది. ఈ ఘటనను స్థానికుడు ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది.
డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కనకనగర్‌లో జీవిస్తుంది రుబాయి కుటుంబం జీవిస్తుంది. ఆర్ కే ప్యాలెస్ అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నారు. అయితే టెర్రస్ పై పని ఉండి వెళ్లింది రుబాయి. అక్కడే చూసుకోకుండా సబ్బుపై కాలు వేసింది. అంతలో జర్రుమని జారుతూ.. కింద పడిపోతుంటే.. గ్రిల్స్ పట్టుకుంది. ఇది గమనించిన ఆమె భర్త రుబాయిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె హఠాత్తుగా జారి కింద పడిపోయింది. కింద పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు గమనించి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుంది. పై నుంచి పడిన తాకిడికి మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. డీజే హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు దీనిపై సమాచారం సేకరిస్తున్నారు.