Krishna Kowshik
పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఈ రోజుల్లో కొన్ని కలలు, కోరికలు ఉన్నాయి. కాబోయే వరుడు ఇలా ఉండాలి అని ఆశపడుతున్నారు. ఇలాంటి భర్తనే వరుడిగా తీసుకురావాలంటూ కండిషన్లు పెడుతున్నారు. ఇదిగో ఈ అమ్మాయి కూడా..
పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఈ రోజుల్లో కొన్ని కలలు, కోరికలు ఉన్నాయి. కాబోయే వరుడు ఇలా ఉండాలి అని ఆశపడుతున్నారు. ఇలాంటి భర్తనే వరుడిగా తీసుకురావాలంటూ కండిషన్లు పెడుతున్నారు. ఇదిగో ఈ అమ్మాయి కూడా..
Krishna Kowshik
ఒకప్పుడు పెళ్లిళ్లను పెద్దలు కుదిర్చే వారు. అప్పట్లో అబ్బాయి తరుఫు వారిదే డిమాండ్. వరుడు ఎలా ఉన్నా.. కూతురు నచ్చకపోయినా సరే తల్లిదండ్రులు తమ మాట ఫైనల్ చేసి.. భారీగా కట్నకానుకలు ఇచ్చి కూతురికి వివాహం చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా .. వివాహ తంతులో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయి తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో స్పష్టమైన వైఖరిని కలిగి ఉంటుంది. అలాగే తన భర్తకు ఉండాల్సిన లక్షణాలు, తన కోరికల చిట్టాను తల్లిదండ్రుల ముందు ఉంచుంతుంది. అలాంటి వ్యక్తినే వెతకాలంటూ చెబుతుంది. అందుకు కొన్ని కండిషన్లు కూడా విధిస్తున్నారు. దీంతో పేరెంట్స్ కూడా అలాంటి పెళ్లి సంబంధాన్ని చూస్తున్నారు. దీని కోసం మ్యాట్రీమోనీ సైట్స్ సంప్రదిస్తున్నారు.
ఈ సైట్స్ ద్వారా తొలుత ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని.. బాగుంటే సంబంధం సెట్ చేసుకుంటున్నారు. లేకుంటే అక్కడితో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ అమ్మాయి పెళ్లి కోసం షాదీ.కామ్‌ను సంప్రదించింది. ఓ అబ్బాయి ప్రొఫైల్, ఆ మ్యాచ్ నచ్చి.. తొలుత ఆమెతో వాట్సప్‌లో చాట్ చేశాడు. ఇద్దరు ఒకరి ఇష్టాయిలను, అభిప్రాయాలను పంచుకోవడం స్టార్ట్ చేశారు. ఇంతలో అమ్మాయి.. తన పండంటి కాపురానికి 12 సూత్రాలను (కండిషన్లు) ఏకరువు పెట్టింది. అది చదివిన వరుడు షాక్ తిన్నాడు. చివరకు అక్కో అని సంబోధిస్తూ.. నీకో దండం అని చెప్పి.. పరారయ్యాడు. ప్రస్తుతం ఈ వాట్సప్ స్క్రీన్ షాట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఆమె పెట్టిన ఆ 12 కండిషన్లు ఏంటంటే..?
కాబోయే భర్తకు మంచి ఆదాయం ఉండాలి. సొంత ఇల్లు తప్పని సరి. కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులుండాలి. ఓ వేళ పెళ్లి చేసుకుంటే… తనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. వంట కోసం పనిమనుషులను నియమించుకోవాలి. ఏడాదిలో రెండు బిగ్ ట్రిప్స్ ఉండాలి. అలా రెండు స్మాల్ ట్రిప్స్ తప్పనిసరి. తనను ఉద్యోగం చేయాలని బలవంతం చేయకూడదు. ముఖ్యంగా దుర్భాషలాడకూడదు, హింసించకూడదు (తిట్టకూడదు, కొట్టకూడదు). అలాగే తన నుండి కట్నం కోరకూడదు. ఇంతకు ముందు పెళ్లి అయ్యి ఉంటే మొదటి భార్య నుండి పిల్లలు ఉండకూడదు. అత్తమామల జోక్యం అస్సలే ఉండకూడదు అని షరుతులు విధించింది. ఇవి ఓకే అనుకుంటే.. మన బంధాన్ని ముందుకు సాగిద్దాం లేదంటే..లేదు అని చెప్పింది. ఇవి చూసి బిత్తర పోయిన అబ్బాయి.. చివరకు దీదీ (అక్క) అంటూ సంబోధించాడు. దీంతో కోపం వచ్చిన సదరు యువతి.. నీపై మ్యాట్రీమోనీకి ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.