Krishna Kowshik
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి విజయం సాధించింది. ప్రధానిగా మూడవ సారి బాధ్యతలను చేపట్టారు నరేంద్ర మోడీ. అంతలో జీ 7సదస్సు రాగా, ఇటలీకి వెళ్లారు. మరోసారి ఆ దేశ ప్రధానితో మీట్ అయ్యారు
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి విజయం సాధించింది. ప్రధానిగా మూడవ సారి బాధ్యతలను చేపట్టారు నరేంద్ర మోడీ. అంతలో జీ 7సదస్సు రాగా, ఇటలీకి వెళ్లారు. మరోసారి ఆ దేశ ప్రధానితో మీట్ అయ్యారు
Krishna Kowshik
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ కూటమి విజయకేతనం ఎగుర వేసింది. వరుసగా మూడవ సారి అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ సారి ఈ కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ.. ప్రస్తుత అధికార పార్టీ బీజెపీ.. ఇతర కూటమి పార్టీల సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర బీజెపీ నేతలు ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో బీజెపీకి ఝలక్ ఇచ్చారు ఓటర్లు. 240 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఇతర పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. దేశ ప్రధానిగా మూడవ సారి ఎన్నికయ్యారు మోడీ. ఇటీవల ప్రధాని మోడీ 3.0 నేతృత్వంలో కొత్త మంత్రి వర్గం కొలువు దీరిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. అంతలో జీ 7 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం ఇటలీ వెళ్లారు.
తమ దేశానికి విచ్చేసిన మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన వెంటనే మోడీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సాధారణంగా.. ఇటీవల మెలోనీ, మోడీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి విదితమే. గత డిసెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సుకు మోడీ హాజరయ్యారు. అక్కడకు వెళ్లిన మెలోనీ.. ప్రధానితో ముచ్చటించి.. అతడితో సెల్ఫీ దిగి..ఇద్దరు పేర్లు కలిసేలా మెలోడీ (melodi) అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో ఆ పదం ట్రెండ్ అయ్యింది. అంతేకాదు.. ప్రధాని మోడీ సైతం ఆ వీడియోకు స్పందిస్తూ.. ‘ఫ్రెండ్స్ ను కలుసుకోవడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది’ అంటూ రిప్లై ఇచ్చారు.
దీంతో అప్పటి నుండి మీమర్స్ చేతినిండా పని కల్పించినట్లయ్యింది ఈ దేశాల ప్రధానులు. ఇతర దేశాల నేతలతో ఆమె ఇలా ఉంటారని, ప్రధాని మోడీతో మరోలా ఉంటారంటూ సెటైర్స్ పేల్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా జీ 7 సదస్సులో భాగంగా మరోసారి ఈ అపురూప కలయిక చోటుచేసుకుంది. మరోసారి ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘హలో ఫ్రం ది మెలోడీ టీమ్’ అంటూ మరో వీడియోను పోస్టు చేశారు మెలోనీ. మెలోడీ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఇందులో ప్రధాని మోడీ సైతం బిగ్గరగా నవ్వడం కనిపిస్తుంది. దీంతో మరోసారి ట్రెండింగ్‌లో నిలుస్తుంది మెలోడీ హ్యాష్ ట్యాగ్. ఇదిలా ఉంటే.. శుక్రవారం వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీబిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెడనా, జపాన్ సహా పలు దేశాల అధినేతలో విడివిడిగా సమావేశమయ్యారు. తిరిగి ఇండియాకు చేరుకున్నారు మోడీజీ.
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024