Krishna Kowshik
ఆ ఇంటి ముందు హడావుడి నెలకొంది. కోలాహలంగా ఉండటంతో.. అటుగా వెళుతున్న పోలీసులు ఏం జరిగిందని ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడ్డారు
ఆ ఇంటి ముందు హడావుడి నెలకొంది. కోలాహలంగా ఉండటంతో.. అటుగా వెళుతున్న పోలీసులు ఏం జరిగిందని ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడ్డారు
Krishna Kowshik
ఆ ఇంటి ఎదుట కోలాహలం నెలకొంది. అటుగా వచ్చిన పోలీసులు.. ఇక్కడ ఇంత మంది జనాలు ఉన్నారేంటీ అని చూశారు. ఏంటా అని లోపలికి వెళ్లారు దాదాపు పది మంది పోలీసులు. లోపలికి వెళ్లి చూడగా.. బర్త్ డే పార్టీ జరుగుతుంది. అంత మంది ఖాకీలను చూసిన పార్టీ జరుపుకుంటున్న వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలేమైందో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతలో కంగారు పడొద్దని చెప్పిన పోలీసులు.. ఆమెకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపి.. కేక్ కట్ చేసి.. తినిపించారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. అనుకోని అతిధులు వచ్చే సరికి షాక్ తినడంతో పాటు బర్త్ డే జరిపించడంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యిపోయింది ఆ అమ్మాయి. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతుంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఔరయ్యాలో చోటుచేసుకుంది. అజిత్మల్ కొత్వాలిలో ఆదివారం అర్ధరాత్రి పోలీసుల బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఓ ఇంటి వద్ద జనాల కోలాహలం నెలకొంది. పెద్ద యెత్తున జనాలు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. వాహనాలు కూడా చాలా సంఖ్యలో ఉండడంతో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. ఇక్కడేదో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించారు. పెట్రోలింగ్ వాహనాన్ని పక్కగా ఆపి.. ఆ ఇంట్లోకి వెళ్లారు. పోలీసుల ఎంట్రీతో ఖంగుతిన్న బర్త్ డే గర్ల్, ఆమె వేడుకకు వచ్చిన అతిధులు. ఏంటీ ఏమయ్యింది.. ఇలా వచ్చారేంటీ పోలీసులు ఈ సమయంలో అనుకున్నారంతా. చివరకు విషయం తెలిసి నవ్వుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఒక్కసారిగా ఇంత బలగం ఎందుకు వచ్చిందని పోలీసులను చూసి మొదట అందరూ భయపడ్డాం. పోలీసులు అడగ్గానే మా పుట్టినరోజు గురించి చెప్పాం. దీనిపై పోలీస్ స్టేషన్ అధికారి స్వయంగా కేక్‌ను ఆర్డర్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించారు. పోలీసులు చేసిన ఈ సర్‌ప్రైజ్‌కు మేమంతా ఆనందంగా ఉన్నాం. పోలీసుల తీరును చూసి తొలుత ఇంటి వారు ఆశ్చర్యపోయారు. అయితే పోలీసులు ఆ యువతితో కేక్ కట్ చేయగానే అందరి ముఖంలో చిరునవ్వు మెరిసింది’ అని పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఓ అమ్మాయి బర్త్‌డే పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ కూడా వేడుకలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.