Krishna Kowshik
మనకు ఏదైనా సమాచారం కావాలన్న ముందుగా అంతర్జాలంలో వేట మొదలుపెడదాం. అవసరాలను బట్టి.. ఆయా వెబ్ సైట్లను వెతుకుతూ ఉంటారు. అయితే సెర్చ్ చేసే వారిలో యువత ఎక్కువ కాబట్టి.. వారి అవసరాలకు తగ్గట్లు కొన్ని వెబ్ సైట్లు పుట్టుకు వచ్చాయి. అటువంటి వాటిలో ఒకటి..
మనకు ఏదైనా సమాచారం కావాలన్న ముందుగా అంతర్జాలంలో వేట మొదలుపెడదాం. అవసరాలను బట్టి.. ఆయా వెబ్ సైట్లను వెతుకుతూ ఉంటారు. అయితే సెర్చ్ చేసే వారిలో యువత ఎక్కువ కాబట్టి.. వారి అవసరాలకు తగ్గట్లు కొన్ని వెబ్ సైట్లు పుట్టుకు వచ్చాయి. అటువంటి వాటిలో ఒకటి..
Krishna Kowshik
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో..ఇంటర్నెట్ అంతలా అందుబాటులోకి వస్తోంది. అవసరాలకు తగ్గట్లు సామాజిక మాధ్యమాలు, వెబ్ సైట్లు పుట్టుకు వస్తున్నాయి. జీ మెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటివే కాకుండా.. ప్రతి పనికి ఓ యాప్, వెబ్ సైట్స్ వచ్చేస్తున్నాయి. సెర్చింజిన్ గూగుల్ ఉంటే చాలు.. తమకు నచ్చిన వెబ్ సైట్స్ వెతికేస్తుంటారు. ఇవి చాలవన్నట్లు టిక్ టాక్, జోష్, స్నాప్ చాట్, స్నాప్ చాట్, బెట్టింగ్ అప్లికేషన్లు (యాప్స్) వంటివే కాకుండా టిండర్ వంటి డేటింగ్ యాప్స్ వచ్చేశాయి. ఏదీ అవసరమనుకుంటే.. ఆ యాప్ యాపిల్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసేయడం.. వినియోగించడం చేస్తున్నారు.
వీటిల్లో డేటింగ్ యాప్స్‌పై మక్కువ చూపిస్తుంటారు యువత. తమకు తెలిసిన వారితోనే కాదూ తెలియని వ్యక్తులతో మేసేజ్, చాట్స్ చేస్తూ ఓ రకమైన సంతోషాన్ని పొందుతుంటారు. ఇప్పుడంటే ఇవన్నీ అందుబాటులోకి వచ్చేశాయి కానీ కొన్నేళ్ల క్రితం ఇలాంటి ఓ వెబ్ సైట్ ఉండేదని తెలుసా. అయితే ఇప్పుడు అది శాశ్వతంగా మూత పడింది. అదే ఓమెగల్ (Omegle). ఒంటరి వ్యక్తులు.. అపరిచితులతో లైవ్‌లో కలిసి తమ అభిప్రాయాలను పంచుకునే ఛాన్సును అందించింది. గురువారం నుండి ఈ ప్లాట్ ఫాం పనిచేయడం మానేసింది. ఈ వెబ్ సైట్ శాశ్వతంగా మూసివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు లీఫ్ కె-బ్రూక్స్ లేఖ ద్వారా తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా ఈ వెబ్ సైట్ నడిపేందుకు నిర్వహణ ఖర్చు కష్టంగా మారిందని తెలిపారు.
2009లో ప్రారంభమైన ఈ వెబ్ సైట్ 14 సంవత్సరాల తర్వాత మూసివేశారు. అయితే ఈ వెబ్ సైట్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మైనర్లు కూడా దీనికి ఎడిక్ట్ అవుతున్నారని, ఓమెగల్ దుర్వినియోగానికి గురౌతుందన్న ఫిర్యాదులపై దీన్ని షట్ డౌన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో లీగల్ కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి. కరోనా సమయంలో ఈ ప్లాట్ ఫాం ఆదరణ పొందింది. అయితే ఈ వారంలోనే యునైటెడ్ కింగ్ డమ్.. ఆన్ లైన్ సేఫ్టీ యాక్ట్‌కు సంబంధించి మార్గదర్శకాలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్లు ఈ వెబ్ సైట్ ఆగిపోవడంతో తమ దైన స్టైల్లో స్పందిస్తున్నారు. రెస్ట్ ఇన్ పీస్ (RIP)అంటూ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.
Omegle has officially shut down after 14 years.
Better make a meme token about it on eth.. oh wait! $OMEGLE pic.twitter.com/3W6MTY91nk— hayate (@itsmehayate) November 9, 2023
Thank you Omegle for all the memories. It was a fun platform to interact with strangers ❤️ RIP 🙏#omegle #omeglereaction #shutdown #RipOmegle #Omegles pic.twitter.com/VbkdHFXnqi
— Hardik Ranjan (@hardikranjan127) November 9, 2023
OMEGLE STOPPED WORKING TODAY?! #RIPOMEGLE #OMEGLE pic.twitter.com/4gZhf79oDz
— cope8333 (@cope8333) November 9, 2023