Uppula Naresh
Uppula Naresh
పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నిమిదిన్నర ఏళ్ల బాలుడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కర్ణాటకకు చెందిన ఈ బాలుడిని పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నియమించారు. దీంతో ఆ బాలుడు, అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ కావడమే నా కల అంటూ ఆ బాలుడు మీడియతో చెప్పుకొచ్చాడు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినా.. ఎనిమిదిన్నర ఏళ్లకే పోలీస్ ఇన్ స్పెక్టర్ బాధ్యతలు చేపట్టడం ఏంటని అనుకుంటున్నారా? దీనికి ఓ రీజన్ ఉంది. ఇంతకు అసలు స్టోరీ ఏంటంటే?
మీడియా కథనం ప్రకారం.. కర్ణాటకలోని ఉగడూరులో అజామ్ ఖాన్ అనే ఏనిమిదిన్నర ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ బాలుడు గత కొంత కాలంగా గుండె సంబంధితమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు అనేక ఆస్పత్రుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ, ఆ బాలుడి వ్యాధి మాత్రం నయం కాలేదు. మరో విషయం ఏంటంటే? ఈ బాలుడికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉండేది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు అనేక సందర్భాల్లో చెప్పి చూశాడు. ఇక ఎలాగైనా కుమారుడి కోరికను నెర వేర్చాలని అనుకున్నారు తల్లిదండ్రులు. ఇందులో భాగంగానే అజామ్ ఖాన్ కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నత అధికారులను సంప్రదించారు.
ఆ బాలుడికి ఉన్న కోరికతో పాటు బాధ పడుతున్న వ్యాధి గురించి కూడా చెప్పారు. పోలీస్ అధికారులు స్పందించి ఆ బాలుడి కోరిను తీర్చాలని అనుకున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాలుడు అజామ్ ఖాన్ ను గంట పాటు పోలీస్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించేందుకు అంగీకరించారు. ఇక ఆ బాలుడు డ్రెస్ ధరించి గంట సేపు పోలీస్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించాడు. కాగా, అజామ్ ఖాన్ సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇదే కాకుండా పలు రిజిష్టర్లను సైతం పరిశీలించి సంతకం కూడా చేశాడు. ఆ తర్వాత అజామ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. నేను పోలీస్ ఆఫీసర్ కావాలనే కల ఉందని తెలిపాడు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: HYD: మహిళపై థర్డ్ డిగ్రీ? ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ