iDreamPost

HYD: మహిళపై థర్డ్ డిగ్రీ? ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

HYD: మహిళపై థర్డ్ డిగ్రీ? ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

ఆగస్టు 15వ రోజు రాత్రి పోలీసులు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న ఓ మహిళను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను రాత్రంతా స్టేషన్ లోనే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో స్టేషన్ లో ఆ మహిళపై థర్ట్ డిగ్రీ ప్రయోగించారనే కేసులో రాచకొండ సీపీ స్పందించారు. దీంతో వెంటనే ఇద్దరు పోలీసులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో వరలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఈ మహిళ ఆగస్టు 15వ రోజు రాత్రి సరూర్ నగర్ లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ మహిళ ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు ఆ మహిళను గమనించి అడ్డగించారు. ఎక్కడికి వెళ్లావు, ఎక్కడి నుంచి వస్తున్నావని ఆమెను ప్రశ్నించారు. ఇదే కాకుండా ఆమెను నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె వాపోయినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు రాత్రంతా ఆమెను పోలీస్ స్టేషన్ లోనే ఉంచి ఉదయం ఇంటికి పంపించారు.

కాగా, ఆమెపై రాతంత్రా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఇంత దారుణంగా ఎలా కొడతారంటూ బాధిత మహిళ బంధువులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక ఈ విషయం చివరికి రాచకొండ సీపీ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన మహిళా కానిస్టేబుల్ సుమలత, హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేరుకేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఓ మహిళపై ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: దగ్గరుండి మరీ భర్తకు మరో పెళ్లి చేసిన భార్య.. చివర్లో ట్విస్ట్‌ ఊహించలేరు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి