ఆటోలకు సీసీ కెమెరాలు పెట్టింది దొంగల కోసం కాదు..ఎందుకో తెలుసా?

పైన ఫొటోలో ఆటోకు కనిపిస్తున్న సీసీ కెమెరాలు పెట్టింది దొంగల కోసం కాదట. మరి దేని కోసం తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

పైన ఫొటోలో ఆటోకు కనిపిస్తున్న సీసీ కెమెరాలు పెట్టింది దొంగల కోసం కాదట. మరి దేని కోసం తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు రాకుండా ఉండేందుకు ఒక్కోరు ఒకలా ఆలోచిస్తుంటారు. మరి కొందరు వ్యక్తులు మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని అంది పుచ్చుకుని శ్రమని తగ్గించుకుని స్మార్ట్ వర్క్ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, బిజినెస్ లు చేసే వ్యాపారులు దొంగల నుంచి బయటపడడంతో పాటు చోరీలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు వారి షాపుల్లో సీసీ కెమెరాలను అమర్చుతుంటారు. ఈ రోజుల్లో చిన్న వ్యాపారులు నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ ల వరకు అందరూ ఇదే సూత్రాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. పైన ఫొటోలో ఆటోకు సీసీ కెమెరాలు పెట్టింది దొంగల కోసం కాదట. ఎందుకో తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకు సీసీ కెమెరాలను ఎందుకు అమార్చారో తెలుసా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మహదేవ అనే వ్యాపారి కూరగాయాల బిజినెస్ చేస్తున్నాడు. ఇందు కోసం అతడు ఓ ఆటోను కొనుగోలు చేశాడు. ఇందులో భాగంగానే కొంతమందిని కుర్రాళ్లను కూరగాయాలను విక్రయించేందుకు పనిలో పెట్టుకున్నాడు. అయితే, వ్యాపారం సరిగ్గా జరుగుతుందా? పని వాళ్లు సరిగ్గా వర్క్ చేస్తున్నారా? డబ్బులు వెనకేసుకుంటున్నారా అనే అనుమానం వ్యాపారి మహదేవకు ఉండేది. ఇవన్నీ తెలుసుకునేందుకు ఆ వ్యాపారీ తన ఆటోకు పైన సీసీ కెమెరాలను అమర్చాడు. అప్పటి నుంచి అతడు ఇంట్లో కూర్చుని ఎంచక్కా వ్యాపారం ఎలా సాగుతుందని సీసీ కెమెరాలో చూస్తూ తెలుసుకుంటున్నాడట.

దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయం తెలుసుకుని నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు. టెక్నాలజీని ఇలా ఉపయోగించుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. వావ్.. నీ ఐడియా సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆటోకు సీసీ కెమెరాలు అమర్చి ఇంటి నుంచి వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న వ్యాపారి మహదేవ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments