iDreamPost
android-app
ios-app

వీడియో: కరెంట్ పోల్ పై ల్యాండ్ అయిన మహీంద్రా కార్!

సాధారణంగా వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తుంటారు.. పార్కింగ్ ప్లేస్. లేదంటే ఏదైనా ప్లేస్ ఖాళీగా ఉంటే.. అక్కడ పార్క్ చేస్తారు. కానీ ఈ వాహనం ఎక్కడ పార్కింగ్ అయ్యిందో చూశారు కదా. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

సాధారణంగా వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తుంటారు.. పార్కింగ్ ప్లేస్. లేదంటే ఏదైనా ప్లేస్ ఖాళీగా ఉంటే.. అక్కడ పార్క్ చేస్తారు. కానీ ఈ వాహనం ఎక్కడ పార్కింగ్ అయ్యిందో చూశారు కదా. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

వీడియో: కరెంట్ పోల్ పై ల్యాండ్ అయిన మహీంద్రా కార్!

ఈ రోజుల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో హృదయ విదారకరంగా లేక గుజుప్పాకరంగా, భయానకంగా యాక్సిండెట్స్ జరుగుతుంటాయి. రోడ్డు మీదకు వెళితే.. ఇంటికి తిరిగి వస్తామన్న నమ్మకం ఉండని రోజులివి. మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగం, నిద్రలేమితో డ్రైవ్ చేయడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొంటుంటారు. అలాగే ఫూటుగా మద్యం సేవించి రయ్ మంటూ దూసుకెళుతుంటారు. తమ ప్రాణాలు కన్నా ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహనం నుజ్జు నుజ్జు కావడం లేదంటూ.. పల్టీలు కొట్టడం చూసుంటారు.

కానీ ఇక్కడ చూస్తున్న ప్రముఖ కంపెనీ కార్ ఏకంగా విద్యుత్ స్థంభంపైనే ఎక్కేసింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. కారు కరెంట్ పోల్ ఎక్కడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు స్థానికులు. వాహనం అక్కడెలా ఎక్కిందబ్బా అంటూ సందేహంతో తిలకిస్తున్నారు. సైబర్ సిటీ ప్రాంతంలో పెట్రోల్ బంకు సమీపంలో గోల్ఫ్ కోర్స్ రోడ్ ఎక్స్‌టెన్షన్‌లో జరిగిన ఘటనను ఫోటోలు,వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మహీంద్రా థార్ ఎస్‌యూవీ వాహనం అలా ఎలా నిలబడిందని ప్రశ్నించుకుంటున్నారు. ఇంతకు ఆ కారు అక్కడ అలా పార్కింగ్ చేయడానికి కారణం ఎవరో తెలుసా.. ఓ మహిళ. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

అంచల్ గుప్తా అనే మహిళ తన వాహనం మహీంద్రా థార్ తీసుకుని బయటకు వచ్చారు. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఉన్న పెట్రోల్ పంపు దగ్గరకు తన కారులో ఫ్యూయల్ నింపేందుకు వెళుతుండగా.. హోండా అమేజ్ వాహనం వెనుక నుండి వేంగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా బండిపై నియంత్రణ కోల్పోయారు అంచల్. దీంతో వాహనం కరెంట్ స్థంబం ఎక్కింది. ఆమె ఈ ప్రమాదం నుండి తప్పించుకునేందుకు కారులో నుండి దూకేసింది. ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ.. కారు విద్యుత్ స్థంబంపై ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే..థార్ వాహనాన్ని ఢీ కొట్టిన తర్వాత..  మరో కారులో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. మొత్తానికి ఆ కారును తొలగించినట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి