Uppula Naresh
విమానంలో హల్ చల్ చేసిన గుర్రం. విమానంలో గుర్రం హల్ చల్ ఏంటని ఆశ్చర్యానికి గురవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
విమానంలో హల్ చల్ చేసిన గుర్రం. విమానంలో గుర్రం హల్ చల్ ఏంటని ఆశ్చర్యానికి గురవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
Uppula Naresh
ఇటీవల ఓ విమానంలో ఉన్నట్టుండి ఓ గుర్రం బోను నుంచి బయటకు దూకింది. ఇంతే కాకుండా అందులో అక్కడకు ఇక్కడకు తిరుగుతూ హల్ చల్ చేసింది. దీన్ని చూసి ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదే విషయాన్ని వెంటనే విమానంలో ఉన్న పైలెట్లకు సమాచారం అందించారు. దీంతో అలెర్ట్ అయిన ఆ పైలెట్లు ఆ విమానాన్ని అత్యవసరంగా ఓ చోట ల్యాండింగ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఈ విమానాన్ని ఓ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి మళ్లీ బోనులోకి పంపించేశారు. ఇదే వార్త ఇప్పుడు నెట్టంట తెగ వైరల్ గా మారుతోంది. ఇంతకు విమానంలోకి గుర్రం ఎలా వచ్చింది? అసలు విమానంలో గుర్రం హల్ చల్ చేయడం ఏంటనే అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల న్యూయార్క్ లోని జెఎఫ్ కే నుంచి బెల్జియంకు ఓ విమానం బయలు దేరింది. ఇందులో కొన్ని జంతువులను మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఇక ఆ పైలెట్లు ఆ విమానాన్ని టేకాఫ్ చేశారు. అలా 30 నిమిషాల పాటు ఆ విమానం గాల్లో తేలుతూ వెళ్లింది. అయితే ఈ క్రమంలోనే విమానంలోని బోనులో ఉన్న ఓ గుర్రం ఉన్నట్టుండి బయటకు వచ్చింది. ఇంతే కాకుండా అందులో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేసింది. ఆ గుర్రాన్ని గమనించిన అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. భయంతో ఏం చేయాలో అర్థం కాక కొందరు అరుపులు, కేకలు వేశారు. మరి కొందరు ప్రయాణికులు ఇదే విషయాన్ని వెంటనే పైలెట్లకు సమాచారం అందించారు.
దీంతో షాక్ గురైన ఆ పైలెట్లు ఆ విమానాన్ని తిరిగి న్యూయార్క్ లోని ఓ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఆ పైలెట్లు సురక్షితంగా ఓ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఆ గుర్రాన్ని పట్టుకుని తిరిగి మళ్లీ ఆ బోనులోకి ఎక్కించినట్లు తెలుస్తుంది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల న్యూయార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే నెటిజన్స్ ఈ ఘటనపై ఒక్కొరు ఒకలా స్పందిస్తున్నారు. విమానంలో గుర్రం ఉన్నట్టుండి హల్ చల్ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.