iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లిలో వరుడికి కరెన్సీ నోట్లతో భారీ దండ.. ఎన్ని లక్షలో తెలుసా?

పెళ్లిలో అందరూ పూల దండను ధరిస్తుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం ఏకంగా మొత్తం రూ.500 నోట్లతో తయారు చేసిన భారీ దండను ధరించాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

పెళ్లిలో అందరూ పూల దండను ధరిస్తుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం ఏకంగా మొత్తం రూ.500 నోట్లతో తయారు చేసిన భారీ దండను ధరించాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

వీడియో: పెళ్లిలో వరుడికి కరెన్సీ నోట్లతో భారీ దండ.. ఎన్ని లక్షలో తెలుసా?

పెళ్లి అనేది జీవితంలో అందరూ ఒకసారి చేసుకునేది. కొన్ని పరిస్థితుల కారణంగా కొందరు రెండు మూడు వివాహాలు కూడా చేసుకుంటుంటారు. ఇక వివాహాన్ని ఎంతో ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. ఇతరుల కంటే ఎక్కువ ఖర్చును వెచ్చించి అంగరంగ వైభవంగా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఈ పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తించుకునేందుకు కొందరు వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఘనంగా జరుపుకుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం పెళ్లి అందరిలా కాకుండా కాస్త స్పెషల్ గా చేసుకోవాలని భావించాడు. తాను అనుకున్నట్లే చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పెళ్లిలో కేవలం కరెన్సీ నోట్లతోనే భారీ దండను ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని చూసి పెళ్లికి వచ్చిన బంధువులు నోళ్లు తెరిచారు. ఆ వరుడు ధరించిన దండకు అన్ని రూ.500 నోట్లు వాడడం విశేషం. ఇక ఆ దండకు కేటాయించిన ఆ డబ్బు ఎంతో తెలుసుకుని గ్రామస్తులతో పాటు బంధువులు అవాకయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని కురేష్ పూర్ కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇతడు వివాహాన్ని అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా చేసుకోవాలని భావించాడు. పెళ్లిలో భాగంగా ధరించే పూల దండలను ఏకంగా కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను ధరించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే అతడు అన్నీ రూ.500 నోట్లతో తయారు చేసిన భారీ దండను తయారు చేసుకుని దాన్ని పెళ్లిలో వేసుకున్నాడు. అతడు దండను వేసుకున్న సమయంలో కొందరు వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

ఆ వీడియోకు అతి తక్కువ రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ తో పాటు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఈ దండకు రూ.2 లక్షల నోట్లు ఉపయోగించినట్లు తెలుస్తుంది. అందులో అన్నీ రూ. 500 నోట్లు ఉపయోగించడం ఉండడం విశేషం. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లిలో కరెన్సీ నోట్లతో భారీ దండను ధరించిన వరుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by dilsad khan (@dilshadkhan_kureshipur)

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş