iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో బెట్టింగ్ బాలిక..! పోలీసులకే చెమటలు పట్టించింది!

డ్రామాలాడితే ఎప్పటికైనా తెలిసిపోతుందనడానికి ఇదే నిదర్శనం. పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారన్న యువతి.. అసలు విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందంటే?

డ్రామాలాడితే ఎప్పటికైనా తెలిసిపోతుందనడానికి ఇదే నిదర్శనం. పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారన్న యువతి.. అసలు విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లో బెట్టింగ్ బాలిక..! పోలీసులకే చెమటలు పట్టించింది!

చిన్న చిన్న సరదాలు అప్పుడప్పుడు ఇరకాటంలో పడేస్తుంటాయి. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేసి అడ్డంగా బుక్కవుతుంటారు. ఇదే విధంగా ఓ యువతి చేసిన పని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తను చేసిన పనిని కప్పి పుచ్చుకునేందుకు పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామాకు తెరలేపింది ఆ యువతి. తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారంటూ మీడియా ముందు చెప్పుకొచ్చింది. వారిని అడ్డగించే ప్రయత్నం చేసినప్పటికీ తనను తోసేసి పారిపోయారని తెలిపింది. ల్యాప్ టాప్, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెల్లారంటూ వెల్లడించింది. కానీ అసలు జరిగిన విషయం తెలిసి పోలీసులే షాకయ్యారు.

హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎర్రబోడ కాలనీలో ఉంటున్న ఓ యువతి ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బును పోగొట్టుకుంది. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా క్రియేట్ చేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని తెలిపింది. కావాలనే బీరువాలోని బట్టలు ఇంట్లో చిందరవందరగా పడేసి చోరీ డ్రామాకు తెరలేపింది. అయితే స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఆ యువతి ఇచ్చిన ట్విస్టుకు పోలీసులు బిత్తరపోయారు. దీంతో యువతి స్కెచ్ బెడిసికొట్టింది.

ఇటీవల చాలా మంది యువత బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఆకర్షితులై చిక్కుల్లో పడుతున్నారు. ఈజీగా మనీ సంపాదించేందుకు ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని, అప్పులపాలై రోడ్డున పడుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా ఆ యువతి ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో చోరి జరిగిందంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మరి ఆన్ లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.