ఘోరం.. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అసలు ఏం జరిగిందంటే?

మెదక్ లో ఘోరం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం వెళ్లి తిరిగివస్తున్న యువతికి ఊహించని ఘటన ఎదురైంది. ఈ ఘటన మెదక్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

మెదక్ లో ఘోరం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం వెళ్లి తిరిగివస్తున్న యువతికి ఊహించని ఘటన ఎదురైంది. ఈ ఘటన మెదక్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఒక్కోసారి అనుకోకుండా జరిగే సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేము. ఆకస్మిక ప్రమాదాల వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఇక లేరని తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తారు. ఈ క్రమంలో తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి పొలం పనుల కోసం వెళ్లగా ఘోరం జరిగింది. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు రైలు ఢీకొని యువతి మృతి చెందింది.

రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోతున్నారు. కదులుతున్న రైలు ఎక్కుతూ.. రైల్వే ట్రాకులను దాటుతూ ప్రమాదాల భారిన పడుతున్నారు. రైల్వే ట్రాకుల వెంట అజాగ్రత్తగా నడుస్తూ మత్యువును కొని తెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలో గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. రమ్య మధ్యాహ్నం వేళ వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లింది.

అక్కడ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అలా వస్తున్న క్రమంలో కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని రమ్య మృతి చెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ తావు నాయక్ ఘటనా స్థలం చేరుకొని పంచనామ నిర్వహిం చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments