రైతులకు కావాల్సింది ఇది కదా.. నానో ట్రాక్టర్ ను తయారు చేసిన యువకుడు

రైతులకు గుడ్ న్యూస్. తక్కువ ఖర్చుతో నానో ట్రాక్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకుడు. ఇది రైతులకు అన్ని రకాల వ్యవసాయ పనుల్లో ఉపయోగపడనున్నది.

రైతులకు గుడ్ న్యూస్. తక్కువ ఖర్చుతో నానో ట్రాక్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకుడు. ఇది రైతులకు అన్ని రకాల వ్యవసాయ పనుల్లో ఉపయోగపడనున్నది.

వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం నానాటికి పెరుగుతున్నది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొత్త కొత్త పరికరాలు పుట్టుకొస్తున్నాయి. దుక్కి దున్నే దగ్గర్నుంచి మొదలుకుని పంట చేతికి వచ్చేంత వరకు మెషిన్లతోనే పనులు కానిస్తున్నారు. అయితే ఈ యంత్ర పరికరాల ధరలు లక్షల్లో ఉండడంతో రైతులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. ట్రాక్టర్లు, వరికోత మెషిన్లు ఇంకా ఇతర యంత్ర పరికరాలను కిరాయికి తెచ్చుకుని వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు. ఇదంతా రైతులకు తలకుమించిన భారం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు వినూత్నమైన ఆవిష్కరణకు తెరలేపాడు. రైతుల కోసం నానో ట్రాక్టర్ ను రూపొందించాడు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.

మెకానిక్ పనులు చేసే బ్రహ్మచారి అనే యువకుడు తనకున్న నైపుణ్యంతో నానో ట్రాక్టర్ ను రూపొందించాడు. చేనేత వృత్తి కార్మికుల కష్టాలను తీర్చేందుకు చింతకింది మల్లేశం ఆసు యంత్రాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఇప్పుడు బ్రహ్మచారి కూడా ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నానో ట్రాక్టర్ ను రూపొందించారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. ఏ మాత్రం డ్రైవింగ్ అనుభవం లేని రైతు కూడా దీన్ని నడపొచ్చు. అంతర పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రాక్టర్ టన్ను బరువు వరకు లాగ గలదు. దీనికి డైనమో కూడా బిగించుకోవచ్చు.

ఈ ట్రాక్టర్ తయారు చేయడానికి లక్షా 40వేల రూపాయలు ఖర్చయింది. ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు లీటర్ డీజిల్ కావాలి. గంటకు 10 నుండి 15 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. స్టీరింగ్ దగ్గరే బ్రేక్, గేర్ లు ఉంటాయి. మొత్తం చేతులతోనే ఆపరేట్ చెయ్యొచ్చు. త్వరలోనే దీనికి హైడ్రాలిక్ సిస్టమ్​ ను కూడా జోడిస్తానంటున్నాడు చారి. అన్ని రకాల వ్యవసాయ పనులకు ఈ నానో ట్రాక్టర్ ఉపయోగకరంగా ఉండనున్నది. మెదట్లో ఒక్క గేరుతో నడిచే నానో ట్రాక్టర్​ తయారు చేశానని. అప్పుడు 75వేల రూపాయలు ఖర్చైందని బ్రహ్మచారి తెలిపారు. దీని వాడకంతో ఖర్చుకూడా తక్కువగా అవుతుండడంతో రైతులకు ఆర్థిక భారం తప్పినట్లు అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show comments