Keerthi
ఇటీవల కాలంలో గ్రామంలోని ఉండే ప్రజలు ఆనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వైద్యునికి బదులుగా ఆర్ఎంపీలను సంప్రాదిస్తుంటారు. ఇక అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న ఆర్ఎంపీలు తామే డాక్టర్లుగా ఇష్టానుసరంగా చికిత్సలు చేసి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. అయితే తాజాగా వరంగల్ వరంగల్ కు చెందిన ఓ యువకడు జ్వరంతో బాధపడుతు గ్రామంలో ఉండే ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వెళ్లాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే..
ఇటీవల కాలంలో గ్రామంలోని ఉండే ప్రజలు ఆనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వైద్యునికి బదులుగా ఆర్ఎంపీలను సంప్రాదిస్తుంటారు. ఇక అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న ఆర్ఎంపీలు తామే డాక్టర్లుగా ఇష్టానుసరంగా చికిత్సలు చేసి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. అయితే తాజాగా వరంగల్ వరంగల్ కు చెందిన ఓ యువకడు జ్వరంతో బాధపడుతు గ్రామంలో ఉండే ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వెళ్లాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే..
Keerthi
సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా, ఒంట్లో కస్తా నలతగా ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది వైద్యుడు. ఎందుకంటే.. ఆ సమయంలో ఆరోగ్యం బాధపడుతున్న రోగులకు తక్షణమే కాస్త మెరుగుడేలా చేస్తారు వైద్యలు. అందుకే కనిపించని ఆ దేవుడి కంటే ముందు వైద్యుడినే రోగులు మొక్కుతుంటారు. కానీ, ఇటీవల కాలంలో పల్లెల్లో ఉండే చాలామంది ప్రజలు ఆరోగ్యం బాగోలేకపోతే.. ముందుగా ఆయా గ్రామాల్లో వైద్యం చేసే ఆర్ఎంపీలనే డాక్టర్లుగా భావించి వైద్యం చేయించుకోనుటకు సంప్రాదిస్తారు. ఇక వారి వైద్యం, సలహాలనే ఎక్కువగా ఆచారిస్తుంటారు. అయితే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల అమాయకత్వాలను ఆసరాగా చేసుకొని, తామే వైద్యులమని ఇష్టానుసారంగా చికిత్సలు చేస్తూ.. ఆ అమాయక ప్రజల ప్రాణాలకు మీదకు తెస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా వరంగల్ కు చెందిన ఓ యువకడు జ్వరంతో బాధపడుతు గ్రామంలో ఉండే ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వెళ్లాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే..
ఇటీవల కాలంలో గ్రామంలోని ఉండే ప్రజలు ఆనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వైద్యునికి బదులుగా ఆర్ఎంపీలను సంప్రాదిస్తూంటారు. ఇక అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న ఆర్ఎంపీలు తామే డాక్టర్లుగా ఇష్టానుసరంగా చికిత్సలు చేసి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. అయితే తాజాగా వరంగల్ వరంగల్ కు చెందిన ఓ యువకడు జ్వరంతో బాధపడుతు గ్రామంలో ఉండే ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వెళ్లాడు. అయితే గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో రెండు రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చ చేసినా ప్రాణాలు దక్కలేదు.కాగా, ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ నెల 26న నవీన్ కు విపరీతమైన జ్వరంతో పాటు, నీరసంగా ఉండడంతో.. పట్టణంలోని ఫిరంగిగడ్డకు చెందిన ఆర్‌ఎంపీ ఆడెపు శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు.
అయితే నవీన్ ను ఆ ఆర్ఎంపీ పరీక్షించి కుడి, ఎడమ తొంటికి రెండు ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు సెలైన బాటిల్ కూడా పెట్టాడు. కాగా, అందులో మరో నాలుగు ఇంజక్షన్లు కూడా వేశాడు. దీంతో చికిత్స పొందుతున్న నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. ఆ ఆర్‌ఎంపీ వెంటనే మరో ఇంజక్షన్ ఇచ్చాడు. ఇలా గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో నవీన్ పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ ఆర్ఎంపీని నిలదీయడంతో.. నవీన్ ను ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అతడు సూచించాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లగా నవీన్ కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పడంతో.. వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు.
ఇక అక్కడ కూడా ఒక రోజు ట్రీట్‌మెంట్ చేసిననప్పటికీ నవీన్ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత విషమించింది. దీంతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే నవీన్ చనిపోవడంతో ఆర్‌ఎంపీ శ్రీనివాస్ వర్ధన్నపేట నుంచి పరార్ అయ్యారు. దీంతో ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ నవీన్ భార్య మేఘన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి, జ్వరంతో బాధపడుతున్న యువకుడు ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకొని ప్రాణాలు కోల్పొయిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.