భువనగిరి కలెక్టరేట్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం!

ఇటీవల వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిండు కుటుంబాల్లో మంటలు చెలరేగుతున్నాయి. పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ఇటీవల వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిండు కుటుంబాల్లో మంటలు చెలరేగుతున్నాయి. పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశానికి గురై ఎదుటి వారిపై దాడులకు తెగబడటం.. లేదా బలవన్మరణానికి పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల కలత చెందిన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం, ప్రియుడితో కలిసి భర్తను చంపడం, ప్రియురాలితో కలిసి భార్యను చంపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం కత్తిపోటు ఘటన తీవ్ర కలకలం రేపింది. అగ్రి కల్చర్ ఆఫీస్ లో పని చేస్తున్న ఇద్దరు ఎంప్లాయిస్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ అనే ఉద్యోగిపై శిల్ప అనే ఉద్యోగిని అందరి ముందు కత్తితో దాడి చేయడం సంచలనం రేపింది. కత్తిపోటు తో గాయపడ్డ మనోజ్ ని సహ ఉద్యోగులు వెంటనే భువన‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ మనోజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్ కి మెరుగైన చికిత్స కోసం తరలించినట్లు సమాచారం.  పోలీసులు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు పాల్పడ్డ శిల్ప మండల వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేస్తుంది. మనోజ్ యాదగిరి గుట్ట మండంలోని మాసాయిపేటలో ఏఈఓ గా పనిచేస్తున్నాడు.

ఆత్మకూర్ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఏవో గా పనిచేస్తున్న శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012 లో వివాహం జరుగుతున్నట్లు తెలుస్తుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రెండు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటున్న శిలకు మనోజ్ పరిచయం కావడంతో ఆ పరిచయం లివింగ్ రిలేషన్ షిప్ వరకు వెళ్లింది. శిల్పతో విభేదాలు రావడంతో మనోజ్ రెండు నెలల నుంచి ఆఫీస్ కి రావడం మానేశాడు.  ఈ క్రమంలోనే  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనోజ్ రావడంతో శిల్ప అతనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తనపై మనోజ్ దాడి చేయడానికి ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు శిల్ప అనడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show comments