iDreamPost
android-app
ios-app

ఎంతకు తెగించింది భయ్యా!.. జాలిపడి లిఫ్ట్ ఇస్తే.. బట్టలు చించుకుని కేకలేస్తూ..

రోడ్డు మీద వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగి ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బు వసూల్ చేస్తోంది ఓ మహిళ. డబ్బు ఇవ్వకుంటే బట్టలు చించుకుని, కేకలు వేస్తూ నానా రచ్చ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రోడ్డు మీద వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగి ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బు వసూల్ చేస్తోంది ఓ మహిళ. డబ్బు ఇవ్వకుంటే బట్టలు చించుకుని, కేకలు వేస్తూ నానా రచ్చ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎంతకు తెగించింది భయ్యా!.. జాలిపడి లిఫ్ట్ ఇస్తే.. బట్టలు చించుకుని కేకలేస్తూ..

ఈజీ మనికి అలవాటు పడిన వారు ఎలాంటి అడ్డదారులను తొక్కడానికైనా వెనకాడడం లేదు. కష్టపడకుండా ఎలాగైన డబ్బు సంపాదించాలని ఎంతటి ఘోరానికైనా తెగిస్తున్నారు కొందరు. ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బును వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది అమాయకులు బలైతున్నారు. అలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి వారిలో మార్పు కనపడడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో ని జూబ్లీహిల్స్ లో ఓ కిలాడీ లేడీ రోడ్డునపోయే వారిని లిఫ్ట్ అడిగి మరీ డబ్బు వసూల్ చేస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నది. బాధితుడి కంప్లైంట్ తో ఆ కిలాడీ లేడీ బాగోతం బట్టబయలైంది.

ప్రస్తుత రోజుల్లో రోజుకో రకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. చిట్టీల పేరుతో, స్కీముల పేరుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ జనాలను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇంకొంత మంది మహిళలు సులభంగా డబ్బు సంపాదించేందుకు మరో కొత్త రకం మోసాన్ని ఎంచుకున్నారు. దర్జాగా రోడ్డుపై నిల్చోని వచ్చే కార్లను లిఫ్ట్ కావాలని ఆపి, ఆ తర్వాత వారి అసలు ప్లాన్ ను అమలు చేస్తున్నారు. లిఫ్ట్ ఇచ్చిన వారిని బెదిరించి డబ్బు, నగలను దోచుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో ఇదే రకమైన ఘటన చోటుచేసుకుంది. మహిళ లిఫ్ట్ అడిగిందని లిఫ్ట్ ఇచ్చినందుకు.. డబ్బు ఇవ్వకుంటే రేప్ చేశావని కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. ఆ కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆ కిలాడీ లేడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రోడ్డు మీద వెళ్లే వాహనదారులను ఆపి ఏదో అర్జంట్‌ పని ఉందంటూ మాయమాటలు చెప్పి లిఫ్ట్ అడగుతుంది ఓ మహిళ. వాహనంలో ఎక్కిన తర్వాత ‘రేప్’ చేయబోయారని బెదిరిస్తూ డబ్బులు లాగుతుంది. డబ్బులు ఇవ్వని వారిని తాను అడ్వకేట్ నని కేసులు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతుంది. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్‌ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ మహిళ ఓ కారు ఎక్కింది. దిగే సమయానికి డబ్బులు ఇవ్వమని డ్రైవర్ ను డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా నానా రచ్చ చేసింది.

మహిళ ఇలా చేయడంతో ఖంగుతిన్న సదరు డ్రైవర్‌ పరమానంద.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె కదలికల మీద నిఘా వేసి కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. నిందితురాలిని సయీదా నయీమా సుల్తానాగా గుర్తించారు. నగర వ్యాప్తంగా ఆమెపై 17 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మహిళ చేసిన మోసానికి పలువురు అమాయకులు కేసుల్లో చిక్కుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి లిఫ్ట్ పేరుతో డబ్బులు వసూల్ చేస్తున్న మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియాజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి