Arjun Suravaram
మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. మరికాసేపట్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ వార్త తెలిసి మందు బాబులు తెగ గింజుకుంటున్నారని సమాచారం. మరి.. ఎందుకు క్లోజ్ కానున్నాయి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. మరికాసేపట్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ వార్త తెలిసి మందు బాబులు తెగ గింజుకుంటున్నారని సమాచారం. మరి.. ఎందుకు క్లోజ్ కానున్నాయి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్యంగా రోజు రోజూకి పెరిగిపోతుంది. ఏదైనా కార్యక్రమం జరిగితే మద్యం ఉండటం అనేది కామన్ గా మారింది. మందులేని అది కార్యక్రమమే కాదనే భావనలో చాలా మంది ఉన్నారు. కొందరికి అయితే మద్యం తాగనిదే రోజు ప్రారంభం కాదు. మరికొందరికి ఆదివారం వచ్చిందంటే చాలు అదో రకమైన పండగా ఫీలవుతుంటారు. చుక్క,ముక్కను తెచ్చుకుని సండేను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే సమయంలో మందుబాబులకు ఓ చేదువార్త వచ్చింది. కాసేపట్లో వైన్ షాపుల బంద్ కానున్నాయి. మరి.. ఎందుకు, ఏమిటి ఆవివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
హైదరాబాద్ లో కాసేపట్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. కేవలం మద్యం షాపులో కాకుండా బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా క్లోజ్ కానున్నాయి. నగరంలోన్ని అన్ని మద్యం షాపులు మూసివేయాలని సిటీ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు జరగొద్దని, మద్యం దుకాణాలు మూయాలనితర పోలీసులు సూచించారు. అయితే మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథాతధంగా నడవనున్నాయి.
ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా మార్చి24 ఆదివారం సాయంత్రం 6 గంట నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, ఇతర రెస్టారెంట్లు మూతపడనున్నాయి. మే 25న హోలీ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పండగ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హోలీ పండుగను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా జరుపుకోవద్దని ప్రజలకు సూచించారు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకోవద్దని, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. ఎవరైన పబ్లిక్ కు ఇబ్బందిని కలిగిస్తూ, రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా… బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు. ఎవరైనా మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు, మద్యంషాపుల నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరారు. మొత్తంగా మద్యం షాపులు క్లోజ్ కానున్న సంగతి తెలిసి.. మందుబాబులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారని సమాచారం.