iDreamPost
android-app
ios-app

రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో..

  • Published Sep 04, 2024 | 3:50 PM Updated Updated Sep 04, 2024 | 4:07 PM

IMD Issues Heavy Rains in Telangana: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

IMD Issues Heavy Rains in Telangana: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారాయి. పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ఇప్పడు మళ్లీ తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు వివిధ జిల్లాలకు పింక్, రెడ్, గ్రీన్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ చెబుతుంది. వివరాల్లోకి వెళితే..

కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలక పింక్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మెదక్, సిద్దిపేట, మేడ్చల్ యాదాద్రి, భువనగిరి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్లలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మెదక్, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

rain alert

అలాగే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికల తో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ జిల్లాలకు పింక్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మెరుపులు, ఈదురు గాలులు 30-40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఐదు రోజుల పాలు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.