iDreamPost
android-app
ios-app

Weather Report: దంచికొడుతున్న ఎండల వేళ..తెలంగాణకు చల్లటి కబురు!

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడి పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు ఓ చల్లటి కబురు వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడి పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు ఓ చల్లటి కబురు వచ్చింది.

Weather Report: దంచికొడుతున్న ఎండల వేళ..తెలంగాణకు చల్లటి కబురు!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడి పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఈ ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాపోవడమే కాకుండా ఎప్పుడు శాంతిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వేడిగాల్పులకు మూగ జీవాలు సైతం విలవిల్లాడి పోతున్నాయి. తెలంగాణలో సైతం ఎండలు విజృభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక్కడి ప్రజలకు ఓ చల్లటి కబురు వినిపించింది వాతావరణ శాఖ. మరి.. ఈ చల్లటి కబులు ఏమిటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మార్చిలో ఓ మాదిరిగా ఉన్న ఎండలు, ఏప్రిల్ మొదటి వారంలో తీవ్ర స్థాయిలో ఉన్నాయి.  తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనాలు నీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా వేసవి ఎండతో సతమతమవుతున్న తెలంగాణ  ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచాన వేసింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే  ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rains in Telangana in next 2 days!

తెలంగాణలో నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అలానే తరచూ నీరు తాగుతూ వండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  వృద్ధుల, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని  అధికారులు  చెబుతున్నారు. ఏవైనా బయట పనులు ఉంటే.. ఉదయం, సాయంత్ర వేళ చూసుకోవడం మంచిదని  అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఎండల వేడితో అల్లాడి పోతున్న తెలంగాణకు వాతావరణ శాఖ వాన కురిసే అవకాశం ఉందనే చల్లటి కబురును అందించింది.