హైదరాబాద్ లో మార్చి 9 నుంచి నీటి సరఫరా బంద్

హైదరాబాద్ లో మార్చి 9 నుంచి నీటి సరఫరా బంద్

హైదరాబాద్ మహానగరంలో తరుచు ఎప్పటికప్పుడు నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాాగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.

హైదరాబాద్ మహానగరంలో తరుచు ఎప్పటికప్పుడు నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాాగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజున నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నీటి వాడకం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో నగరంలోని ఎక్కడ చూసిన నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. పైగా ఎక్కడికక్కడ నీటి లీకెజీ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అసలే వేసవి కాలం సమీపించడంతో నగరంలోని నీళ్ల సమస్య అనేది ప్రజల పై మరింత ప్రభావం చూపుతుంది. కనుక ఇకపై నగరంలో ప్రజలకు ఏలాంటి నీళ్ల కొరత లేకుండా చేసేందుకు అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా చేస్తున్న ఉస్మాన్ సాగగర్ జలాశయం నుంచి నగరానికి నీటి సరఫరా చేసే నీటి కాలువ హకీంపేట్ వరకు భారీ లీకేజీ ఏర్పడింది. అయితే ఈ భారీ లీకేజీనకు మరమత్తులు పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందుకోసం నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక నగరంలో ఏర్పాడిన ఈ భారీ లీకేజీ సమస్యను పరిష్కరించేందుకు శనివారం (మార్చి9) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు ఈనెల 9వ తేదీన తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పాడనుంది. కాగా, 18 గంటల పాటు కొనసాగిన ఈ మరమ్మత్తులకు ఈ ప్రాంతాల్లో అంతరాయం కలగనుంది.

అయితే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో.. విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్, బజార్ ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్ కమ్ ట్యాక్స్ ఏరియా, సెక్రటేరియట్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీ కపుల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మల్యే క్వార్టర్స్, ఎల్ బీ స్టేడియం, బీఆర్ కె భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, దోమల్ గూడ, గాంధీనగర్, ఘోడే కాబ్ర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, నూర్ నగర్.. తదితర ప్రాంతాల్లో ఈ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమై నీటిని పొదుపుగా వాడుకోవాలని అదికారులు సూచించారు.మరి, నీటి మరమ్మత్తుల కారణంగా నగరంలో ఏర్పడిన అంతరాయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments