P Venkatesh
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో ఆ తేదీనాడు నల్లా నీళ్లు బంద్ కానున్నాయి. పలు ఏరియాల్లో వాటర్ సప్లై బంద్ చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో ఆ తేదీనాడు నల్లా నీళ్లు బంద్ కానున్నాయి. పలు ఏరియాల్లో వాటర్ సప్లై బంద్ చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
P Venkatesh
సకల కోటి జీవరాశులకు నీరే జీవనాధారం. నీరు లేకపోతే మానవులు మనుగడ సాధించలేరు. ఇంట్లో నీరు లేకపోతే ఏ పని చేయలేము. వేసవిలో దేశంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయిన విషయం తెలిసిందే. వాటర్ ట్యాంకుల కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. నగరాల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. డిమాండ్ కు సరిపడా వాటర్ సప్లై లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో ఆ రోజు నల్లా నీళ్లు బంద్ కానున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్ కానున్నది. ఆ తేదీనాడు ఆ ఏరియాల్లో వాటర్ సప్లై బంద్ కానున్నట్లు వాటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు.
నగరంలో నీటి సరఫరా బంద్ అవుతుందంటే చాలు ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. వివిధ అవసరాలకు సరిపడా నీటిని ముందుగానే స్టోర్ చేసుకుంటుంటారు. ఒక్కరోజు వాటర్ రాకపోతే ఇబ్బంది పడిపోతుంటారు. హైదరాబాద్ మహానగరంలో ఇక ఇప్పుడు మరోసారి వాటర్ సప్లై బంద్ కానున్నది. ఈ నెల 30న ఉదయం 6 గంటల నుంచి 31 ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు వాటర్బోర్డు అధికారులు ప్రకటించారు. పటాన్ చెరులోని మంజీరా ఫేజ్-1 పైపులైన్ జంక్షన్ పనుల నేపథ్యంలో 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఏయే ఏరియాల్లో వాటర్ సప్లై బంద్ కానుందంటే?
బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరు, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట, డోయెన్స్ కాలనీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వెల్లడించారు. పైపులైన్ పనులు పూర్తైన వెంటనే నీటి సరఫరాను పునరుద్దరించనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులకు శుద్ధమైన నీటిని అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జలమండలి అధికారులు.