P Venkatesh
మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు.
మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు.
P Venkatesh
పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కూతురు, అల్లుడిని బైక్ పై ఇంటికి తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురవ్వగా ఆ ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అల్లుడు తీవ్రగాయాలతో విషమ స్థితిలో ఉన్నాడు. దీంతో వారి కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. ఈ అంతులేని విషాదం తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. పండగ పూట అందరితో ఆనందంగా గడపాల్సిన వారు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న హైదరాబాద్లో ఉంటున్న తన కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజును సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అనూష, రాజు. వీరిద్దరు తొర్రూరుకు చేరుకునే సరికి రాత్రి 11 అయ్యింది. ఆ సమయంలో మొరిపిరాలకు వెళ్లేందుకు వాహనాలు ఏమీ లేకపోవడంతో తమను తీసుకెళ్లేందుకు అనూష తన తండ్రిని తొర్రూరుకు రావాల్సిందిగా కోరింది. అనూష తండ్రి వెంకన్న వెంటనే బైక్ పై తొర్రూరుకు చేరుకున్నాడు.ఈ క్రమంలో వెంకన్న తన బైక్ పై కూతురు, అల్లుడిని ఎక్కించుకుని మొరిపిరాలకు బయలుదేరారు.
అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో కిష్టాపురం క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగా.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు వారి బైక్ పైకి దూసుకెళ్లింది. అతి వేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొనడంతో కారు కింద పడిన వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూష, ఆమె భర్త రాజుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే తొర్రూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష మృతి చెందగా.. రాజు పరిస్థితి విషమంగా ఉంది. కొండంత పండగ వేళ తండ్రి, కూతురు మరణించడం, అల్లుడు ఆసుపత్రి పాలవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.