iDreamPost

సామాన్యులకు చెమటలు పట్టిస్తున్న ధరలు.. పాలకూర కేజీ 120, కొత్తిమీర 260!

Vegetable Rates: ధరలు చూసి..సామాన్యులకు చెమటలు పడుతున్నాయి. ఏమి కొన్నేట్టులేదు, ఏమి తినేటట్టులేదు అంటూ పాటపడుకుంటున్నారు. పాలకూర కేజీ 120, కొత్తిమీర కేజీ 260 పలుకుతుంది. మరి.. ధరలు ఎక్కడ, ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..

Vegetable Rates: ధరలు చూసి..సామాన్యులకు చెమటలు పడుతున్నాయి. ఏమి కొన్నేట్టులేదు, ఏమి తినేటట్టులేదు అంటూ పాటపడుకుంటున్నారు. పాలకూర కేజీ 120, కొత్తిమీర కేజీ 260 పలుకుతుంది. మరి.. ధరలు ఎక్కడ, ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్యులకు చెమటలు పట్టిస్తున్న ధరలు.. పాలకూర కేజీ 120, కొత్తిమీర 260!

ఇటీవల కాలంలో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. వేటిని ముట్టుకున్న షాక్ కొట్టేలానే ఉన్నాయి. ఇక వీటి ధరలు చూసి..సామాన్యులకు చెమటలు పడుతున్నాయి. ఏమి కొన్నేట్టులేదు, ఏమి తినేటట్టులేదు అంటూ పాటపడుకుంటున్నారు. కేవలం కూరగాయల ధరలతో పాటు ఆకు కూరల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. పాల కూర కేజీ కట్ట 120, అలానే కొత్తి మీర కేజి 260 అంట. ఇవి జస్ట్ చిన్న ఉదాహరణలు మాత్రమే..మిగిలిన కూరగాయల ధరలు వీటిని మించి ఉన్నాయి.

సామాన్య జనం కూరగాయలను కొనాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. కేవలం 15 రోజుల్లోనే.. ఇంకా చెప్పాలంటే జూన్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి రాకెట్ లా  వీటి ధరలు దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా వంద సెంచరి అన్నట్లు సాగుతుంది. ఇక వెజిటేబుల్ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వానలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో పంటల పెరగుదల ఆలస్యంతో పాటు దిగుబడి తగ్గింది. దీనికి తోడు పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.

అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు దిగుమతి కావాల్సిన కూరగాయలు భారీగా నిలిచిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువగా టమాట సాగు చేసే  మహారాష్ట్ర నుంచి  వచ్చే  పంట రావడం లేదు. దీంతో టమాట ధరలు రోజురోజుకు ఆకాశం వైపే వెళ్తున్నాయి తప్పా..నేల వైపు చూడటం లేదు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో టమా 60 నుంచి 80 మధ్య నడుస్తుంది. అలానే ఉల్లిగడ్డల సప్లయ్ కూడా బాగా తగ్గిపోయింది. మరోవైపు ఆకుకూరలు కూడా మార్కెట్లోకి రావడం లేదు. దీంతో వీటికి భారీగా ధర పలికింది. ప్రస్తుతం పాలకూర కేజీ రూ.120 పలుకుతుంది. అలానే కొత్తి మీర కేజీ 260 ఉంది. పచ్చి మిర్చి అయితే ఏకంగా 180 ఉంది.

ఇక బీరకాయ, వంకాయ, బంగాళ దుంపలాంటి కూరగాయలు కిలో వంద దాటాయి.  మిగిలిన కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ఇక పెరిగిన కూరగాయల ధరలు చూసి.. పచ్చడి మెతుకులే దిక్కని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  కూరగాయల ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు ఆవేదన , ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలనీ జీతాలతో ఇప్పటికే పలు ఖర్చులకు తోడు ఈ కూరగాయలు ధరలు పెరుగుదలతో ఇల్లు గడవటమే కష్టంగా మారిందని మధ్యతరగతి కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన కూరగాయల ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి