తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడిన తమిళ పార్టీ!

Telangana Lok Sabha Election: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు పార్టీ పోటీ చేస్తోంది. రెండు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు. అది కూడా రెండు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

Telangana Lok Sabha Election: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు పార్టీ పోటీ చేస్తోంది. రెండు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు. అది కూడా రెండు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఇంకా మరో ఐడు విడుతల్లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో లోక్ సభతో పాటు ఆ రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అలానే తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ముగియగా..తాజాగా లోక్ సభ ఎన్నిక హడావుడి మొదలైంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు పార్టీ ఒకటి  బరిలో నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గతేడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అవి జరిగిన సరిగ్గా అయిదు నెలలకే లోక్  సభ ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచించి.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.  ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పార్టీ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది.

తెలంగాణ రాష్ట్రంలో లోక సభ ఎన్నికల బరిలో తమిళ నాడు రాష్ట్రానికి చెందిన ఓ పార్టీ నిలిచింది. భాగ్యనగరంలోని ప్రధాన పార్లమెంట్ స్థానాలు అయినా హైదరాబాద్ , సికింద్రాబాద్  ఎంపీ స్థానాలకు తమిళనాడుకు చెందిన ఓ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల నుంచి విడుతలై చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ పోటీ చేస్తుంది. ఈ పార్టీ తరపు నుంచి నామినేషన్లు  కూడా దాఖలయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పద్మజ నామినేషన్ దాఖలు చేశారు. అలానే  సికింద్రబాద్ నుంచి పగిడి పల్లి శ్యామ్ బరిలో ఉన్నారు.  ప్రస్తుతం వీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్ కొనసాగుతున్నారు. కాగా ఈ పార్టీ తమిళ నాడులో డీఎంకేతో పొత్తులో ఉంది.

తెలంగాణలో మొత్తం  17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.  అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. గతంలో ఈ స్థానాల్లో మూడు వేరు వేరు పార్టీలకు చెందిన వారు గెలుపొందారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దిన్  ఓవైసీ, సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్  రెడ్డి విజయం సాధించారు. అలానే మల్కాజ్ గిరి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. తాజాగా  హైదరాబాద్  సిటీలో తమిళ పార్టీ కూడ బరిలో  ఉంది. మరి.. ఈ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి.

Show comments