P Venkatesh
మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని ఆ రెండు మెట్రో స్టేషన్లు మూత పడనున్నాయి. ఈ విషయాన్ని మెట్రో అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ మెట్రో స్టేషన్లు ఏవంటే?
మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని ఆ రెండు మెట్రో స్టేషన్లు మూత పడనున్నాయి. ఈ విషయాన్ని మెట్రో అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ మెట్రో స్టేషన్లు ఏవంటే?
P Venkatesh
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసు వర్గాల వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, రోడ్ షో నేపథ్యంలో భద్రతా పరమైన చర్యలలో భాగంగా.. సోమవారం సాయంత్రం కొన్ని మెట్రో స్టేషన్స్ లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ట్విట్టర్ లో ప్రకటించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మార్గంలోని చిక్కడపల్లి, నారాయణ గూడ మెట్రో స్టేషన్స్ నేటి సాయంత్రం మూసివేస్తున్నట్టుగా తెలిపారు. భద్రతా కారణాల పరంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా, నేటి సాయంత్రం 4గంటలకు ప్రధాన మంత్రి రోడ్ షో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరంలో భారీగా భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. తిరుమల ప్రచారాన్ని ముగించుకున్న నరేంద్ర మోదీ.. ఇక హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్నారు.
కాగా, ప్రధాని రోడ్ షో..ఈ మార్గాలగుండా సాగబోతోంది. ఎయిర్ పోర్టు వై జంక్షన్, పీఎన్టీ ఫ్లై ఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పెట్, పంజాగుట్ట, రాజీవ్ గాంధీ స్టాట్యూ, యశోద హాస్పిటల్, రాజ్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి, కట్ట మైసమ్మ, ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ X రోడ్స్ మీదుగా రోడ్ షో జరగనుంది. ఈ కారణంగా ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4:30 నిమిషాల నుండి 6:30 నిమిషాల వరకు.. చిక్కడపల్లి, నారాయణ గూడా మెట్రో స్టేషన్స్ నిలిపివేయనున్నారు. ఇప్పటికే మోదీ కరీంనగర్ లో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారి బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
అనంతరం హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు గంటల పాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్స్ మూసివేయనున్నారు. కాగా, మోడీ పర్యటనకు 15 నిమిషాల ముందు తర్వాత కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఇక ఆయా మార్గాలలో వెళ్లే ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.