Venkateswarlu
Venkateswarlu
హైదరాబాద్‌లో మందు బాబులు కొందరు పెచ్చు మీరి విలయ తాండవం చేస్తున్నారు. తాగి గొడవలు పెట్టుకోవటం ఒక ఎత్తయితే.. చేతిలో మందు బాటిల్ ఉంటే చాలు.. ఎక్కడ బడితే అక్కడ తాగేసి పడిపోతున్నారు. రోడ్ల పక్కన, స్కూళ్లలో, పబ్లిక్ గ్రౌండ్లలో.. రైల్వే, మెట్రో స్టేషన్ల దగ్గర.. ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తాగేటం అన్నది కొత్త విషయమేమీ కాదు. కానీ, ఇప్పుడు కొందరు మందు బాబులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఏకంగా జంక్షన్లలో ఉండే ట్రాఫిక్ బూతులను బార్లుగా మార్చేస్తున్నారు. అందులోనే మందు తాగి ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఇద్దరు మందు బాబులు వైన్ షాపులో మందు కొనుక్కున్నారు. తాగటానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి వైన్ షాపునకు దగ్గరగా ఉన్న పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ట్రాపిక్ బూతు కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరి పోయారు. ట్రాఫిక్ బూతును బారు చేసేసి.. మందు సిట్టింగ్ వేశారు. పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ మందు తాగేశారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దీన్నంతా వీడియో తీశారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇలాంటి సంఘటనలు నగరం వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయని అంటున్నారు. అధికారులు అలా ట్రాఫిక్ బూతుల్లో మందు తాగుతున్న వారిపై చర్యలు తీసుకోవటం లేదని మండిపడుతున్నారు. వైన్ షాపులో మద్యం కొనుక్కుని దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్లో కూడా తాగుతున్నారని అంటున్నారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు సైతం ట్యాగ్ చేశారు. మరి, మందు బాబులు ట్రాఫిక్ బూతులో మందు తాగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.