iDreamPost

కార్లు, విమానాల్లోనే కాదు.. ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్ బెల్టులు!

  • Author singhj Published - 09:37 AM, Tue - 8 August 23
  • Author singhj Published - 09:37 AM, Tue - 8 August 23
కార్లు, విమానాల్లోనే కాదు.. ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్ బెల్టులు!

సాధారణంగా కార్లలో సేఫ్టీ కోసం సీట్ బెల్టులను వినియోగిస్తుంటారు. విమాన ప్రయాణాల్లోనూ వీటిని వాడుతుంటారు. ఫ్లైట్​లో జర్నీ చేసే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఇలాంటి నిబంధనే మన ఆర్టీసీ బస్సుల్లోనూ రానుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో తొలిసారిగా సీట్ బెల్టులు ఉండే సిటీ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఫారెన్ కంట్రీస్​లో బస్సుల్లో సీట్ బెల్టులు తప్పనిసరి. వాస్తవానికి మన దేశంలోనూ బస్సుల్లో సీటు బెల్టులు ఉండాలనే నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు. మొదటిసారిగా టీఎస్​ఆర్టీసీ సిటీ సర్వీసుల్లో ఈ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో మరో నెలన్నరలో కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సుల్లో సీట్ బెల్టులు కనిపించనున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ఎలా ఉంటాయనే దానికి సంబంధించిన నమూనా బస్సును సోమవారం బస్ భవన్​కు తీసుకొచ్చారు. ఈ నమూనా బస్సును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్​పోర్టు​తో పాటు ఐటీ కారిడార్ రూట్లలో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. పుష్పక్ పేరుతో ఇప్పటికే 40 ఎలక్ట్రిక్ బస్సులు ఎయిర్​పోర్టు రూట్​లో తిరుగుతున్న విషయం తెలిసిందే.

ఎయిర్​పోర్టు రూట్లలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు మంచి లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్నీ సర్వీసులు లేకపోవడంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే ఐటీ కారిడార్​లో మెట్రో సర్వీసులు అందుబాటులో లేని రూట్లలోనూ కొన్ని బస్సుల్ని తిప్పాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం ఎయిర్​పోర్టు రూట్​లో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు కలిగిన ఈ కొత్త బస్సులు ప్యాసింజర్లకు మరింత మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. ఈ మేరకు 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల కోసం ఆర్టీసీ ఆర్డర్ ఇవ్వగా.. తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 ఎయిర్​పోర్టుకు, 30 ఐటీ కారిడార్​కు తిరుగుతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి