Revanth Reddy: రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. నెలాఖరులోగా మరో హామీ, మహిళలకు డబ్బులు!

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆరు గ్యారెంటీల అమలు తమ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం అని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడమే కాక.. ఆరోగ్య శ్రీని 10 లక్షల రూపాయలకు పెంచారు. త్వరలోనే మిగితా గ్యారెంటీలను అమలు చేయడం కోసం కార్యచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీలకు లబ్ధిదారులను ఎన్నిక చేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది రేవంత్ సర్కార్. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి రాగానే.. అభయహస్తం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అన్నట్లుగానే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీతో పాటు రూ. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.2,500 భృతి హామీలు కూడా ఉన్నాయి.

దీనిలో భాగంగా రేవంత్ సర్కార్ అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 2,500 చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుండగా.. అంతకు ముందే పథకం అమలు చేయాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. దీని గురించి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈక్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న ఇలాంటి పథకాలను అధ్యాయనం చేయాలని రేవంత్ అధికారులు సూచించారు. ఇలాంటి పథకాల కోసం ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలుండగా.. వారిలో కోటీ 25 లక్షల మందికి ప్రతి నెలా ఇలా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్నట్టుగానే తెలంగాణలో కూడా మహిళలకు 2500 రూపాయలు చెల్లిస్తే.. ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందన్న దానిపై  అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అర్హతలతోపాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని.. ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.

Show comments