SNP
TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ ఊహించిన దానికంటే దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఓ నాలుగు జిల్లాలు దారుణంగా దెబ్బకొట్టాయి. మరి ఆ నాలుగు జిల్లాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ ఊహించిన దానికంటే దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఓ నాలుగు జిల్లాలు దారుణంగా దెబ్బకొట్టాయి. మరి ఆ నాలుగు జిల్లాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
SNP
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా చాటుతోంది. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు ఒక్కసారిగా కాంగ్రెస్ వేవ్ మొదలైంది. పరిస్థితిలో ఎందుకు ఇంత మార్పు వచ్చిందో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు అర్థం కాలేదు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్లాం అని చెప్పిన తమకు ఇలాంటి ఫలితాలు వస్తాయని బహుషా.. బీఆర్‌ఎస్ పెద్దలకు సైతం అర్థం కాలేదు. ఏదీ ఏమైనా.. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కంటే మించి కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే అశ్వారరావు పేట, ఇల్లందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ప్రధానంగా ఓ నాలుగు జిల్లాలు గట్టి దెబ్బ కొట్టాయి.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ అందని ద్రాక్షగానే ఉంది. 2014లో కూడా ఇక్కడ గులాబీ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అలాగే 2018లో సైతం ఒక్క సీటు మాత్రమే ఇచ్చింది. ఈ సారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి పెద్ద నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 10కి 10 స్థానాలు కూడా కాంగ్రెస్ వశం కావడం ఖాయంగా కనిపించింది. కానీ, పదేళ్ల సంప్రదాయం కొనసాగిస్తూ.. 8 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో కాంగ్రెస్ మిత్ర పక్షమైన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానాంలో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ గెలిచారు.
ఇక ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొదటి నుంచి నల్లగొండ జిల్లాపై కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఉమ్మడి నల్లగొండలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కేవలం ఒక్క స్థానాలో మాత్రమే బీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో చూసుకుంటే.. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండగా.. 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, కేవలం 2 స్థానాల్లో మాత్రం బీఆర్‌ఎస్ లీడింగ్‌లో ఉంది. ఇలా ఈ నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సీట్లు కైవలం చేసుకోవడంతో.. బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. కేవలం ఈ 4 జిల్లాల నుంచే కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం విశేషం. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధిస్తున్న ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.