Revanth Reddy Review On Prajapalana: ప్రజాపాలనపై CM రేవంత్ కీలక ప్రకటన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు

Revanth Reddy: ప్రజాపాలనపై CM రేవంత్ కీలక ప్రకటన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి.. దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి.. దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి అమలు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6 గ్యారంటీ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది అనగా 2024, జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తోంది.  కార్యక్రమం ప్రారంభమైన రెండు రోజుల్లోనే భారీ ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. నేడు ఈ కార్యక్రమం మూడో రోజు కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజాపాలన 6 గ్యారెంటీలు దరఖాస్తులకు సంబంధించి..  సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనాలు ఎవరూ డబ్బులు పెట్టి దరఖాస్తులు కొనవద్దని ప్రజలకు సూచించిన సీఎం రేవంత్.. అప్లికేషన్ ఫామ్‌లను అమ్మేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అప్లికేషన్ ఫామ్ లను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఈ దరఖాస్తు విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇక.. రైతుబంధు, పింఛన్ పథకాలకు సంబంధించి జనాలు ఎలాంటి అపోహలకు గురి కావద్దు అన్నారు. అలానే పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే ప్రస్తుతం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా తప్పుకుండా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు.

Show comments