iDreamPost
android-app
ios-app

Revanth Reddy: ఈ ఫోటో వెనుక కథ తెలుసా? ఈ వ్యక్తిని గమనించారా?

  • Author singhj Updated - 03:58 PM, Mon - 4 December 23

తెలంగాణ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో జర్నలిస్ట్​గా పని చేశారని మీకు తెలుసా? అవును. దీనికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో జర్నలిస్ట్​గా పని చేశారని మీకు తెలుసా? అవును. దీనికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Updated - 03:58 PM, Mon - 4 December 23
Revanth Reddy: ఈ ఫోటో వెనుక కథ తెలుసా? ఈ వ్యక్తిని గమనించారా?

ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే సాధించాలనే తపన, కృషి, పట్టుదల కావాలి. వీటికి తోడు క్రమశిక్షణ కూడా తోడైతే వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలి. దానికి తోడు తీవ్రపోటీని ఎదుర్కొని, ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ తమ ఉనికిని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఇలాంటి లీడర్ మనకు కావాలని ప్రజలు కోరుకునేలా చేయాలి. సరిగ్గా పరిశీలిస్తే ఈ లక్షణాలన్నీ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పుష్కలంగా కనిపిస్తాయి. ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా రాజకీయ రంగంలో రాకెట్​లా రివ్వున దూసుకొచ్చారాయన. రవ్వంత రెడ్డి అంటూ ఎందరు ఎగతాళి చేసినా ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా నిలబడి పోరాడి కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయాన్ని అందించారు.

రేవంత్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​లో ఈసారి మారుమోగిన పేరిది. 1969లో ఉమ్మడి మహబూబ్​నగర్​లోని కొండారెడ్డిపల్లిలో పుట్టిన రేవంత్ రెడ్డి.. ఏవీ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. స్టూడెంట్​గా ఉన్నప్పుడు ఏబీపీవీలో యాక్టివ్​గా వ్యవహరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆరెస్సెస్​)తో ఆయనకు అనుబంధం ఉంది. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ ఎలక్షన్స్​లో స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడి గెలిచారు. ఆ తర్వాత 2007లో మహబూబ్​నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లోనూ ఇండిపెండెంట్​గా నిలబడి నెగ్గారు. అనంతరం టీడీపీలో చంద్రబాబు నాయుడు అనుయాయుడిగా ఎదిగారాయన. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్​గా, ఫ్లోర్​లీడర్​గానూ పనిచేశారు.

2015 ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అనంతరం 2017 అక్టోబర్​లో కాంగ్రెస్​లో జాయిన్ అయ్యారు. హస్తం పార్టీలో యాక్టివ్​గా వ్యవహరించిన రేవంత్​కు తక్కువ టైమ్​లోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దొరికింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్​కు మళ్లీ ఊపిరి పోసే ప్రయత్నం చేశారు. 2018 ఎలక్షన్స్​లో కొడంగల్​లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఒకపక్క సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే.. మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేయడం మీద ఫోకస్ పెట్టారు. రేవంత్ పనితీరు బాగుండటంతో 2021 జూన్​లో ఆయన్ను పూర్తిస్థాయిలో టీపీసీసీ ప్రెసిడెంట్​గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.

రేవంత్​ను పూర్తిస్థాయి టీపీసీసీ ప్రెసిడెంట్​గా నియమించడం మీద సొంతపార్టీలోనే విమర్శలు, ఇతర లీడర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోని ఈ డైనమిక్ లీడర్.. తాజా ఎన్నికల్లో పార్టీకి అంతా తానై ముందుండి నడిపించారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాంపెయిన్​ను హోరెత్తించారు. ఈసారి వచ్చేది కాంగ్రెస్సే అని క్యాడర్​లో జోష్ నింపారు. కొడంగల్​లో మూడోసారి ఎమ్యేల్యేగా గెలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేలా చేశారు. అలాంటి రేవంత్ ఒకప్పుడు జర్నలిస్ట్​గా పనిచేశారని మీకు తెలుసా? యంగ్ ఏజ్​లో ఉన్నప్పుడు సహచర జర్నలిస్టులతో కలసి రేవంత్ దిగినట్లుగా చెబుతున్న ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మూడు దశాబ్దాల కింద ‘జాగృతి’ అనే వార పత్రికలో ఆయన వర్క్ చేసినట్లు తెలుస్తోంది. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. జర్నలిస్ట్ నుంచి సీఎం స్థాయికి ఆయన ఎదిగారని అంటున్నారు. మరి.. రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డే సీఎం. ఆ సమయానికే ప్రమాణ స్వీకారం!