iDreamPost

బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డే సీఎం. ఆ సమయానికే ప్రమాణ స్వీకారం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం చేసింది అధిష్టానం. తెలంగాణ సీఎంగా రేవంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం చేసింది అధిష్టానం. తెలంగాణ సీఎంగా రేవంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డే సీఎం. ఆ సమయానికే ప్రమాణ స్వీకారం!

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అనేది తేలిపోయింది. ఇన్ని రోజుల ఉత్కంఠతకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీని తన భుజాలపై వేసుకుని విజయతీరాలకు చేర్చిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సాధించింది. కాగా ఇప్పుడు సీఎం రేసులో ఎవరున్నారు అన్న దానిపై తీవ్రంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించారు.

దీనిలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి ఏకవాక్య తీర్మానం చేశారు. చివరికి అందరు ఊహించినట్టుగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. మాస్ లీడర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి యూత్ లో ఎనలేని క్రేజ్ ఉంది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారం చేజిక్కించుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న అనుముల రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి