ఆ నలుగురు సీన్ రిపీట్.. అయినవాళ్లే అంత్యక్రియలు కూడా జరగకుండా..

Yadadri Bhuvanagiri District- Choutuppal: రూపాయితో పెట్టుకుంటే పచ్చని కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి అని మరోసారి రుజువైంది. ఆ రూపాయి తీసుకొచ్చిన తంటా ఒక వ్యక్తి అంత్యక్రియలకు నోచుకోకుండా చేసింది.

Yadadri Bhuvanagiri District- Choutuppal: రూపాయితో పెట్టుకుంటే పచ్చని కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి అని మరోసారి రుజువైంది. ఆ రూపాయి తీసుకొచ్చిన తంటా ఒక వ్యక్తి అంత్యక్రియలకు నోచుకోకుండా చేసింది.

బంధాలు, అనుబంధాలు, కుటుంబం, పేగు బంధం ఈ పదాలు అన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కానీ, ఎప్పుడైతే సీన్ లోకి రూపాయి ఎంటర్ అవుతుందో అప్పుడు అన్నీ లెక్కలు మారిపోతాయి. పాత సామెత ఉన్నట్లు.. రూపాయి రూపాయి ఏం చేస్తావ్ అంటే.. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడతాను అన్నదంట. అలాంటి పరిస్థితులు చాలానే చూశాం. అటు సినిమాల్లోనే కాకుండా.. నిజ జీవితంలో కూడా చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఒక విషాద, హృదయవిదారకర ఘటన ఒకటి మన తెలుగు రాష్ట్రంలోనే వెలుగు చూసింది. ఆఖరికి అంత్యక్రియలు కూడా చేయకుండా మూడ్రోజులుగా మృతదేహాన్ని మార్చురిలో వదిలేశారు.

ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎంత మంచిగా మెలిగాడో చూపిస్తారు. ఆ తర్వతా అతని మరణానంతరం తనకు అంత్యక్రియలు చేయకుండా కొందరు అడ్డు పడతారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే శవాన్ని కదలనిస్తాం అంటూ ఆపేస్తారు. ఆ తర్వాతే అసలు ఎవరి రూపం ఏంటి అనే విషయం తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో క్లయిమ్యాక్స్ మాత్రం మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు. అలాంటి సినిమాలు చూసిన తర్వాత కూడా మనుషుల్లో మార్పు రావడం లేదు. ఈ దారణం యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది. చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన హనుమంతరెడ్డి(48) ప్రైవేటు బస్సు డ్రైవర్ గా చేసేవాడు.

హైదరాబాద్ లోనే బస్సు డ్రైవర్ గా పని చేస్తూ.. అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పోస్టుమార్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు మీద 7.24 ఎకరాల భూమి ఉంది. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత హనుమంతరెడ్డి తోబుట్టువులు ఆస్తిలో భాగం కోసం కోర్టుకు ఎక్కారు. మరోవైపు హనుమంతరెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డికి కూడా ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ ఆస్తి తగాదాలు ఎంతకీ తెగకపోవడంతో హనుమంతరెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి పంతంగికి చేరుకున్నాడు. అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని హనుమంతరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హనుమంతరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హనుమంతరెడ్డి భార్య తన భర్త మృతికి కారణం మరిది.. ఆడపడుచులే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హనుమంతరెడ్డి భార్య ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో కంగారు పడిన తోబుట్టువులు గ్రామ పెద్దలతో హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే హనుమంతరెడ్డి భార్య మాత్రం కోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకుంటేనే అంత్యక్రియలు చేస్తామంటూ కూర్చుకున్నారు. చివరికి పెద్దల చర్చలు, హనుంతరెడ్డి సోదరుడు, చెల్లెళ్లు అందుకు ఒప్పుకున్నారు. కానీ, కోర్టు సమయం మించిపోవడంతో ఆ విషయం కాస్తా వాయిదా పడింది. ఇలా అయిన వాళ్లే ఆస్తులు, తగాదాలు అంటూ హనుమంతరెడ్డికి అంత్యక్రియలు చేయకుండా ఆపేశారు.

Show comments