iDreamPost
android-app
ios-app

అందరూ ఉన్నా అనాథలా.. కన్నతల్లికి కొరివి పెట్టేందుకు కూడా ముందుకు రాకుండా..

  • Published Apr 06, 2024 | 10:11 PM Updated Updated Apr 06, 2024 | 10:11 PM

Suryapet Crime News: నవమాసాలు మోసీ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తన బిడ్డను చూసుకొని ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని ఒట్టే మర్చిపోతుంది. కానీ ఈ మద్య కన్నబిడ్డలు కన్నతల్లి ప్రేమను మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

Suryapet Crime News: నవమాసాలు మోసీ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తన బిడ్డను చూసుకొని ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని ఒట్టే మర్చిపోతుంది. కానీ ఈ మద్య కన్నబిడ్డలు కన్నతల్లి ప్రేమను మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

  • Published Apr 06, 2024 | 10:11 PMUpdated Apr 06, 2024 | 10:11 PM
అందరూ ఉన్నా అనాథలా.. కన్నతల్లికి కొరివి పెట్టేందుకు కూడా ముందుకు రాకుండా..

ఈ మధ్య కాలంలో బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మంట కలిసిపోతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను, అన్నదమ్ములను ఒకరినొకరు చంపుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వృద్దాప్యంలో తమకు ఆసరాగా ఉంటారునుకుంటున్న కొడుకులు తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టడానికి పోటీలు పడుతున్నారు. కొంతమంది తమ తల్లిదండ్రులను భారంగా భావించి వృద్దాశ్రమాలకు పంపుతున్నారు. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. వృద్దాప్యంలో కోడుకులు ఆసరాగా ఉంటారనుకుంటే అనాథగా వదిలివేశారు.  వృద్దాశ్రమంలో ఉంటూ కన్నుమూస్తే కనీసం తల్లి అంత్యక్రియలు చేయడానికి వెనుకాడారు. స్థానికులు మందలించడంతో ముందుకు వచ్చారు.. ఈ అమానవీయ ఘటన సూర్యపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు అని కవి అందెశ్రీ చెప్పినట్లు.. నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా నశించిపోయింది. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిపై కనికరం చూపలేదు ఇద్దరు కొడుకులు. వృద్దాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూడాల్సిన కొడుకులు దుర్మార్గులుగా మారారు. మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించింది. ఆమె అంత్యక్రియలకు కూడా పోటీ పడి ఎవరూ ముందుకు రాలేదు. అనుబంధాలు సమాధి చేసే అమానవీయ ఘటన సూర్యపేటలో జరిగింది. సూర్యపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన మన్నూరి రామస్వామి, సైదమ్మ (80) దంపతులకు ఇద్దరు కొడుకులు. కూలీ నాలి చేస్తూ జీవం కొనసాగిస్తున్నారు. రామస్వామి 30 ఏళ్ల క్రితం చనిపోగా.. కొడుకులు తల్లిని దగ్గరకు తీయలేదు. దీంతో విద్యానగర్ రామాలయం వద్ద ఓ గుడిసె వేసుకొని ఒంటరిగా జీవిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో కాలం వెల్లదీస్తుంది.

దౌర్భాగ్యం ఏంటంటే ఆమె మనవలు, మనవరాళ్లు కూడా పట్టించుకోలేదు. ఇటీవల వృద్దాశ్రమంలో చేరింది సైదమ్మ. ఈ మధ్య సైదమ్మ ఆరోగ్యం క్షిణించింది. ఆమె ఆరోగ్యం విషయం కొడుకులకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూసింది. సైదమ్మ చనిపోయిన విషయం ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ వద్ద డబ్బు లేదని. ఈ మృతదేహాన్ని తీసుకొని వెళ్లేందుకు నిరాకరించారు ఇద్దరు కొడుకులు. అంతేకాదు హుజూర్ నగర్ మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కటుంబ సభ్యులను మందలించారు. అంతేకాదు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. ఈ అమానవీయ ఘటన గురించి స్థానికంగా చర్చించుకుంటున్నారు.. వీళ్లు కూడా ఒకనాటికి ముసలి వాళ్లు అవుతారు.. వీళ్ల పిల్లలు కూడా అలాగే చేస్తారన్న కనీస జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.