Arjun Suravaram
లా మంది జీవితాలు చిన్న చిన్న ఒడిదుడుగులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొంటు సంతోషంగా జీవితం సాగిస్తుంటారు. అలానే ఓ రెండు కుటుంబాలు కూడా సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా విషాదం నిండింది.
లా మంది జీవితాలు చిన్న చిన్న ఒడిదుడుగులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొంటు సంతోషంగా జీవితం సాగిస్తుంటారు. అలానే ఓ రెండు కుటుంబాలు కూడా సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా విషాదం నిండింది.
Arjun Suravaram
కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలానే చాలా మంది జీవితాలు చిన్న చిన్న ఒడిదుడుగులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొంటూ సంతోషంగా జీవితం సాగిస్తుంటారు. అయితే కొన్ని జీవితంలో మాత్రం విధి ఆడిన వింత నాటకంలో చీకటి ఏర్పడుతుంది. ఎవరో చేసిన తప్పుకు మరేవరో బలవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన తప్పు రెండు ప్రాణాలు బలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి చెందిన రెంజర్ల స్వామి అనే వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ని మండలంలోని బడాపహాడ్ దర్గాలు వెళ్లాలని భావించారు. వీరందరూ కలిసి గురువారం రాత్రి తొమ్మిది బడాపహాడ్ దర్గాకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నిజామాబాద్ గ్రామీణ మండలంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రెంజర్ల వసంత(30), రెంజర్ల శ్యాంసుందర్(48) అక్కడికక్కడే మృతి చెందారు.
అలానే ఈప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను నిజమాబాద్ జిల్లాకు చెందిన అన్ని పార్టీల నేతలు శుక్రవారం పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాహన డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇక ఈప్రమాదంలో మరణించిన రెంజర్ల శ్యాం సుందర్ రెండు కుటుంబాలకు పెద్ద దిక్కుడా ఉన్నాడు. శ్యాంసుందర్ 19ఏళ్ల క్రితం ఏనుగు అంజయ్య కూతురు భారతిని వివాహం చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. శ్యామ్‌సుందర్ తండ్రి రెంజర్ల చిన్న నర్సయ్య 12ఏళ్ల క్రితం మరణించాడు. అలానే శ్యాసుందర్ మామ అంజయ్య కొన్నేళ్ల క్రితం కొవిడ్‌తో మరణించారు. దీంతో రెండు కుటుంబాల బాధ్యతలను శ్యాంసుందర్ చూసుకుంటున్నాడు. ఇలా రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు అయినా శ్యాంసుందర్ మృతితో వారి ఇంట విషాదం అలుముకుంది. ఇటీవలే రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో కారు లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో 6 మంది మరణించారు. పిల్లల పుట్టెంట్రుకలకు వెళ్తా.. ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇలా కొందరు నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంటుంది.