iDreamPost
android-app
ios-app

వీడియో: హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మంటల్లో కారు!

మనిషికి మరణం అనేది తప్పదు. జీవితం వృద్ధాప్యంలోకి చేరిన తరువాత వచ్చే మరణం సంతోషంగా ఉంటుంది. అయితే ఇటీవల జరుగుతున్న మరణాలు రోడ్డు ప్రమాదాలు కూడా ప్రధాన కారణం. తాజాగా తెలంగాణ లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు.

మనిషికి మరణం అనేది తప్పదు. జీవితం వృద్ధాప్యంలోకి చేరిన తరువాత వచ్చే మరణం సంతోషంగా ఉంటుంది. అయితే ఇటీవల జరుగుతున్న మరణాలు రోడ్డు ప్రమాదాలు కూడా ప్రధాన కారణం. తాజాగా తెలంగాణ లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు.

వీడియో: హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మంటల్లో కారు!

ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవ్వరం చెప్పలేము. అయితే కొన్ని యాదృచ్చికంగా రాగా, మరికొన్ని మాత్రం మానవ తప్పింద కారణంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అనేవి నిర్లక్ష్యం, వేగంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి వాటి కారణంగా ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా ఇక ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వాహనాలు అగ్నిప్రమాదానికి కూడా గురవుతుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై లారీ, కారు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా ముత్తంగా గ్రామం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెం 3 వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీ కొట్టింది. ఇలా ఈ రెండు ఢీ బలంగా ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ఆ రెండు వాహనాల నుంచి మంటలు చెలరేగడంతో అందరు భయాందోళనకు గురయ్యారు. ఇక మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా, అవే మంటలు లారీకీ అంటుకున్నాయి.

ఓఆర్ ఆర్ పై జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాద ఘటనతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లారీకి, కారుకు అంటుకున్న మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, దాని నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అలానే  సూర్యపేట జిల్లాలో కూడా ఘోర ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణం పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి విజయవడా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.