Arjun Suravaram
పిల్లలు తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు మాత్రమే ఇష్టపడుతుంటారు. నచ్చని కూర వండితే ఆ రోజు అన్నమే తినరు. ఉపవాసమైనా ఉంటారు.. కానీ ఆ వంట వాసన కూడా చూడరు. అలానే ఓ బాలుడు చికెన్ తినలేదు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు.
పిల్లలు తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు మాత్రమే ఇష్టపడుతుంటారు. నచ్చని కూర వండితే ఆ రోజు అన్నమే తినరు. ఉపవాసమైనా ఉంటారు.. కానీ ఆ వంట వాసన కూడా చూడరు. అలానే ఓ బాలుడు చికెన్ తినలేదు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు.
Arjun Suravaram
ఈ కాలంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులకు పెద్ద సవాల్. ముఖ్యంగా అన్నం తినిపించే విషయంలో వారి కష్టాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు తిండి తినాలంటే.. తల్లిదండ్రులు చెమటోడ్చాల్సిందే. ఇక చాలా మంది ఎంతో సహనంగా మాటలు చెప్పుకుంటూ పిల్లలకు అన్నం తినిపిస్తుంటారు. కొందరు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయి.. పిల్లలపై ప్రతాపం చూపిస్తుంటారు. దారుణంగా ఒళ్ళు వాచేలా కొడుతుంటారు. తాజాగా ఓ తండ్రి..తన కొడుకు చికెన్ తినలేదని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శ్రీనివాస్, మహేశ్వరి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఆయన స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు మురళి(9) అనే కుమారుడు ఉన్నాడు. నిన్న ఇంటికి శ్రీనివాస చికెన్ తెచ్చాడు. సాధారణంగా పిల్లలకు చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు. లెగ్ పీస్, లివర్ అంటూ.. అడిగిమరీ ముక్కలు వేయించుకుని రెండు ముద్దలు ఎక్కువ తింటారు. కానీ.. మురళికి మాత్రం చికెన్ అస్సలు ముట్టలేదు. ఎంతో ఇష్టంగా తింటాడని చికెన్ తీసుకొస్తే.. అస్సలకే ముట్టకపోవటంతో శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయి.. కుమారుడిని చితకబాదాడు.
దీంతో మురళి శరీరమంతా వాపు వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి మహేశ్వరి కుమారుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అనంతరం భర్త శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చికెన్ పెట్టిన తంట పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా శ్రీనివాస్ కే కాకుండా ప్రతి తల్లిదండ్రులకు పిల్లలకు తినిపించటమనేది ఒక ప్రహాసనంగా మారింది. అయితే.. ఇలా అందరూ ఉంటారని కాదు. కొందరు పిల్లలు బుద్ధిగా తింటుంటారు. అలాంటి పిల్లల్లో కూడా ఒక అలవాటు ఉంటుంది.
పిల్లలు నచ్చిందైతే రోజూ తినేదాని కన్నా ఓ ముద్ద ఎక్కువే తింటారు. ఇక నచ్చని కూర విషయానికి వస్తే మాత్రం తినటం పక్కన పెట్టండి.. కనీసం దాని వాసన కూడా చూసేందుకు ఇష్టపడరు. అలానే ఈ శ్రీనివాస్ కొడుకు ఉన్నాడు. పిల్లలకు ఏదైనా ఇష్టం లేకపోతే, ఏదో విధంగా మంచి మాటలు చెప్పి తినిపించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ తినకపోతే వాళ్లకు నచ్చింది పెట్టాలి కానీ, ఇలా కొట్టటమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సిల్లీ కారణాలకు పసిపిల్లలను కొట్టడమేటని మరికొందరు మండిపడుతున్నారు. మొత్తానికి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.