Arjun Suravaram
ధనవంతుల్లో కొందరు.. అమాయకులపై జూలుం ప్రదర్శిస్తుంటారు. తమను ఎవరు ఏమి చేయలేరులేనే గర్వంతో ఓవరాక్షన్ చేస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా దాడులకు కూడా తెగబడుతుంటారు.
ధనవంతుల్లో కొందరు.. అమాయకులపై జూలుం ప్రదర్శిస్తుంటారు. తమను ఎవరు ఏమి చేయలేరులేనే గర్వంతో ఓవరాక్షన్ చేస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా దాడులకు కూడా తెగబడుతుంటారు.
Arjun Suravaram
ఆర్థికంగా బలంగా ఉన్నవారిలో కొందరు.. అమాయకులపై జూలుం ప్రదర్శిస్తుంటారు. తమను ఎవరు ఏమి చేయలేరులేనే గర్వంతో ఓవరాక్షన్ చేస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా దాడులకు కూడా తెగబడుతుంటారు. తాజాగా హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారంటూ అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో కామినేని ఆస్పత్రి ఉన్నసంగతి తెలిసిందే. ఇక్కడ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద.. గత కొన్నేళ్లు అంబులెన్సులు పార్కింగ్ చేసుకుంటున్నారు. ఎల్బీనగర్ పరిధిలో ఉంటే ప్రైవేట్ ఆస్పత్రులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అంబులెన్సులను అక్కడ పార్క్ చేసుకుంటారు. అలానే ఎక్కడంటే అక్కడ నిలిపి ట్రాఫిక్ సమస్య వస్తుందని, అలా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్లైఓవర్ కింద తమ అంబులెన్సులను డ్రైవర్లు పార్క్ చేసుకుంటున్నారు. అక్కడే న్యూ మల్టీ కార్ కంపెనీ ఒకటి ఉంది.
అంబులెన్స్ లు ఫ్లై ఓవర్ దగ్గర పార్క్ చేయడం వలన తమ బిజినెస్ జరగడం లేదని కార్ల కంపెనీ ఓనర్ భావించాడు. దీంతో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పినట్లు సమాచారం. అంబులెన్సులు ఫ్లైఓవర్ కింద పార్క్ చేయొద్దంటూ న్యూ మల్టీ కార్ ఓనర్ డ్రైవర్లతో వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో.. అంబులెన్స్ డ్రైవర్లకు, ఆ కార్ల కంపెనీ ఓనర్ మధ్య మాటా మాటా పెరిగింది. ఆ చిన్న గొడవ కాస్త దాడికి దారి తీసింది. ఆ ఓనర్ తన మనుషులను పిలిపించి.. అంబులెన్స్ డ్రైవర్లపై దాడి చేయించాడు. మొత్తంగా తమ బిజినెస్ జరగట్లేదంటూ.. న్యూ మల్టీ కార్ కంపెనీ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లపై దాడికి దిగాడు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఇదే కాకుండా గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అధికార బలం, అంగం బలం చూసుకుని అమాయకులపై రెచ్చిపోతుంటారు. తమను ఎవరు ఏమి చేయలేరులే అనే ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినప్పుడు కొందరు బడబాబుల పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా దాడికి కూడా దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాశమైంది.
అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి
హైదరాబాద్ – తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు.
అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని… pic.twitter.com/KOs4yOz3nx
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024