Arjun Suravaram
ఎంతో మంది యువత చదువుకునేందుకు నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లి కొందరు ఉన్నత స్థితికి వెళ్తుంటే.. మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఊహించని షాకులిస్తున్నారు. తాజాగా ఓ యువతి చదువుకునేందుకు సిటీకి వచ్చి.. తన కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.
ఎంతో మంది యువత చదువుకునేందుకు నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లి కొందరు ఉన్నత స్థితికి వెళ్తుంటే.. మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఊహించని షాకులిస్తున్నారు. తాజాగా ఓ యువతి చదువుకునేందుకు సిటీకి వచ్చి.. తన కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.
Arjun Suravaram
ఈ భూమి మీద ఏ జీవికి లేని ప్రత్యేకతలు మనిషికి ఉన్నాయి. శారీరకం, వేగంలో పరంగా కొన్ని జీవుల కంటే మనిషి బలహీనుడైన.. మానసికంగా మాత్రం చాలా బలమైనవాడు. అందుకే అన్ని రకలా మూగ జీవాలను తన ఆధీనంలో పెట్టుకోగలుగుతున్నాడు. అయితే తన మనస్సును మాత్రం అదుపులో పెట్టుకోలేక వివిధ రకాల భావోద్వేగాలకు గురవుతున్నారు. ముఖ్యంగా సమస్య ఎదురైతే చాలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువత కూడా చిన్నపాటి కష్టాలకు, సమస్యలకు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చిన యువతి తన తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చింది.
ఎంతో మంది యువతీయువకులు చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు పట్టణాలకు వెళ్తుంటారు. అలా తమ బిడ్డలు సిటీల్లో చదువుకుని మంచి ప్రయోజకలుగా కావాలని వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొందరు చదువులో బాగా ముందుండి..తమ కుటుంబ సభ్యుల కలను సాకారం చేస్తుంటారు. కొందరు యువత మాత్రం ఊహించని నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను షాక్ కి గురి చేస్తుంటారు. విధి ఆడిన వింత నాటకంలో కొందరు యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతుంటారు. మరికొందరు మాత్రం వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తుంటారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఆత్మహత్య ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాకు చెందిన సాహితి(24) ఎంబీఏ చదివేందుకు హైదరాబాద్ వచ్చింది. నగరంలోని దిల్ సుఖ్ నగర్ లోని ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. ఈ క్రమంలో సాహితి తన రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సాహితి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సిటీకి చేరుకున్నారు. మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో జాబ్ రాలేదని, పెళ్లి కాలేదని, ఇంట్లో వాళ్లు తిట్టారని.. ఇలాంటి కారణాలతో కొందరు యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమలో విఫలమయ్యామని జీవితాన్నే ముగిస్తున్నారు. నిన్న మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మరి.. కారణం ఏదైనప్పటికీ ఇలా యువత ఆత్మహత్యలు చేసుకోవడం అందరిని కలవర పెడుతోంది. ఇలాంటి ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.