iDreamPost
android-app
ios-app

భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Mar 28, 2024 | 7:03 PM Updated Updated Mar 28, 2024 | 7:03 PM

Karimnagar Crime News: ఇటీవల కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.

Karimnagar Crime News: ఇటీవల కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.

భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?

వివాహ బంధంతో ఒక్కటైన జంట చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు నిండు నూరుళ్లు చల్లగా జీవించాలని ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య చాలా జంటలు ఏడాది లోగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సమస్యలు తలెత్తి డిప్రేషన్ కి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడి చేయడం, తమను తాము అంతం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో భార్య వేడి భర్తపై వేడి నీళ్లు పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్, రోహిణి దంపతులు. హేమంత్ స్థానికంగా ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రోహిణి ప్రభుత్వ ఆస్పత్రిలో చిల్డ్రన్స్ కేర్ విభాగంలో జాబ్ చేస్తుంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన రోహిణి అప్పటికే పొయ్యిమీద సల సలా మసలిపోతున్న వేడి నీళ్లు భర్తపై పోసింది.

ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. భర్తు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది రోహిణి. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం హేమంత్ కన్నుమూశాడు. చిన్న విషయానికే విచక్షణ కోల్పోయి రోహిణి చేసిన పని భర్త ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. భార్యాభర్తల మద్య ఎన్నో గొడవలు ఉంటాయి.. అవి పెద్దవి అయితే ఇరు కుటుంబ పెద్దలతో మాట్లాడి తేల్చుకోవాలి.. అంతే కాని ఇలాంటి దారుణాలకు పాల్పపడితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు ఆమె చర్యలను ఖండిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని రోహిణిని అదుపులోకి తీసుకున్నారు.