P Krishna
ఈ మద్య చిన్న విషయాలకే కృంగిపోయి.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఈ మద్య చిన్న విషయాలకే కృంగిపోయి.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
P Krishna
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. లేదా తమను తామే అంతం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు ఆత్మహత్యలకు గల కారణాలు.. ఆర్థిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, నిరుద్యోగం, కెరీర్ సరిగా లేకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ కి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను తీరని దుఖఃంలోకి నెట్టేస్తున్నారు. ఓ భవన సముదాయం నుంచి దూకి మహిళ బలవన్మరణానికి పాల్పపడింది.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై షాపింగ్ మాల్ లో విషాద ఘటన జరిగింది. హౌస్ కీపింగ్ విభాగంలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్న రమణమ్మ (50) అనే మహిళ ఫిబ్రవరి 5న సోమవారం షాపింగ్ మాల్ 2వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రమణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రమణమ్మ ఆత్మహత్య చేసుకునే ముందు తన కుమారుడికి తనను పనిచేసే చోట కొంతమంది వేధింపులకు గురి చేస్తున్నారని ఆడియో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో తల్లికి ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కూకట్ పల్లి పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని.. రమణమ్మ ఆత్మహత్యకు పాల్పపడిందా? ప్రమాద వశాత్తు కిందపడిందా? ఎవరైనా బలవంతంగా నెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు తెలిపారు. రమణమ్మ కూతురు జాష్ణవి తనకు సిబ్బంది సరైన సమాధానం చెప్పడంలేదని.. వారిపై ఆనుమానాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మృతురాలు ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయంచేయాలని రమణమ్మ బంధువులు షాపింగ్ మాల్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఉత్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో సర్ధుమణిగింది.