P Krishna
Hyderabad Crime News: ఈ మద్య చిన్న చిన్న కారణాలతోనే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు ఈ దాడుల వల్ల తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి.
Hyderabad Crime News: ఈ మద్య చిన్న చిన్న కారణాలతోనే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు ఈ దాడుల వల్ల తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి.
P Krishna
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. తర్వాత తమ తప్పు తెలుసుకునే లోపు జరగాల్సిన అనర్థాలు జరిగిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ హాస్టల్ లోని నీరు పరిమిషన్ లేకుండా వాడుతున్నాడన్న కారణంతో యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడు యువకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదారాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న తన స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఓ యువకుడు హాస్టల్ నీళ్లు వాడుకున్నందుకు ఆగ్రహంతో హాస్టల్ నిర్వాహకుడు దారుణంగా దాడికి పాల్పపడ్డాడు. ఆ యువకుడు ఎంతగా బ్రతిమలాడినప్పటికీ కోపంతో ఊగిపోతూ నానా బూతులు తిడితూ కొట్టాడు. చుట్టు పక్కల వాళ్లు, స్నేహితులు ఎంతగా వారించినా వినిపించుకోకుండా విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు హాస్టల్ నిర్వాహకుడిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఆ యువకుడిని అంత దారుణంగా కొట్టడం చాలా అన్యాయం.. ఆ హాస్టల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీళ్లు వాడుకున్నందుకే ఇలా చేస్తారా? లేక ఆ యువకుడు ఇంకేమైనా చేశాడా? అందుకే హాస్టల్ నిర్వాహకుడు అతడిపై దాడి చేశాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు.
హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడి దాడి
హైదరాబాద్ – ఎస్ఆర్నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు.… pic.twitter.com/vn4NAzRpcX
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024