iDreamPost
android-app
ios-app

వీడియో: షాపులో పెరుగు ప్యాకెట్ అడిగి..మహిళపై దారుణం!

Chain Snatcher, Khammam: ఈ కాలంలో ఎవరిని నమ్మాల్లో ఎవరి నమ్మకూడదో అర్థం కాదు. తాజాగా ఓ వ్యకి షాపు వద్దకు వెళ్లి వాటర్ బాటిల్ అడిగాడు. అందులోని మహిళ వాటర్ బాటిస్ ఇస్తుండగా ఆ వ్యక్తి చేసిన పనికి షాకైంది.

Chain Snatcher, Khammam: ఈ కాలంలో ఎవరిని నమ్మాల్లో ఎవరి నమ్మకూడదో అర్థం కాదు. తాజాగా ఓ వ్యకి షాపు వద్దకు వెళ్లి వాటర్ బాటిల్ అడిగాడు. అందులోని మహిళ వాటర్ బాటిస్ ఇస్తుండగా ఆ వ్యక్తి చేసిన పనికి షాకైంది.

వీడియో: షాపులో పెరుగు ప్యాకెట్ అడిగి..మహిళపై దారుణం!

నేటికాలంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే వారి సంఖ్యబాగా పెరిగిపోయింది. కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ ధనం పొందాలనే కోరుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇతరులను మోసం చేస్తుంటే, మరికొందరు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో పలు రకాల గ్యాంగ్ లు తిరుగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఒంటరిగా మహిళలు ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నరు. ఈ క్రమంలో విలువైన వస్తువులను, నగదులు దోచుకెళ్తున్నారు. అలానే తాజాగా ఓ ఖిలాడీగాడు షాపుకు పెరుగు కోసం వచ్చి..మహిళ దారుణానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏమి జరిగిందో, ఎక్కడ జరిగిందో ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇటీవలకాలంలో చైన్ స్నాచర్లు బాగా రెచ్చిపోతున్నారు. వీధుల్లో ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ గా చేసుకుని నగలను దోచుకెళ్తున్నారు. ఈజీ మనీ కోసం కొందరు ఈ చైన్ స్నాచర్లు గా మారుతుంటారు. ఈ క్రమంలోనే వీధుల్లో బైక్ పై వచ్చి.. ఒంటరిగా ఉండే మహిళలను, యువతులను టార్గెట్ గా చేసుకుని, వారి మెడలోని నగలు లాక్కుని అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. ఇలాంటి చైన్ స్నాచర్ల ఆగడాలను పోలీసు అరెస్టు చేసి జైలు తరలిస్తున్నారు. అయినా కొందరిలో మార్పురావడంలేదు. అదే బాటలో వెళ్తూ సామాన్యుల సొమ్మును దోచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే..అడ్రెస్ అడిగినట్లు, వాటర్ అడినట్లు మహిళ దగ్గరు వచ్చి.. అదును చూసి..వారి ఒంటిపై ఉండే నగదును లాక్కుని ఉడాయిస్తున్నారు.

తాజాగా ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి  బైక్ పై హెల్మెట్ పెట్టుకుని కిరాణా షాపు దగ్గరకు వచ్చాడు. అక్కడ షాపులో ఉన్న మహిళను వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. ఈ క్రమంలో ఆమె ఆ వ్యక్తి అడిన వాటిని ఇచ్చే విషయంలో నిమగ్నమైంది. వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ ఇస్తున్న క్రమంలో మహిళ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని ఆ ఖిలాడీ అక్కడి నుంచి ఉడాయించాడు.  అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  బాధితురాలు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి