Keerthi
కూతురు పుట్టిందన్న ఆనందతో ఆ ఇంట్లో పండగ వాతవరణం నెలకొంది. ఇక ఆ సంతోషాన్ని బంధుమిత్రులతో పంచుకునేందుకు ఘనంగా ఆ ఇంట్లో తమ చిన్నారికి బాలసార కూడా నిర్వహించారు. అలా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల మధ్య బాలాసార వేడుకలను ముగించుకొన్నారు. కానీ అంతలోనే ఆ కుటుంబంలో ఆనందం, మధుర క్షణాలు దూరమయ్యాయి. ఊహించని విధంగా ఘోరం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కూతురు పుట్టిందన్న ఆనందతో ఆ ఇంట్లో పండగ వాతవరణం నెలకొంది. ఇక ఆ సంతోషాన్ని బంధుమిత్రులతో పంచుకునేందుకు ఘనంగా ఆ ఇంట్లో తమ చిన్నారికి బాలసార కూడా నిర్వహించారు. అలా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల మధ్య బాలాసార వేడుకలను ముగించుకొన్నారు. కానీ అంతలోనే ఆ కుటుంబంలో ఆనందం, మధుర క్షణాలు దూరమయ్యాయి. ఊహించని విధంగా ఘోరం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Keerthi
అంతా సవ్యంగా సాగే కొన్ని జీవితాల్లో.. ఆనందాలను, మధుర క్షణాలను చూసి బహుశా ఆ దేవుడు కూడా ఓర్వేలేడేమో. అందుకే ఏదో ఒక రూపంలో భరించలేనంత బాధను,మోయలేననంత దుఃఖాన్ని, వేదనను కొన్ని కుటుంబాలకు బహుమతిగా ఇస్తాడు. కనీసం కాస్తంతా కనికరం అనేది ఆ దేవుడికి ఉంటే.. అర్ధంతరంగా కొన్ని జీవితాలకు ముగింపు ఉండదమో. అలాగే కొన్ని బంధాలను కూడా విడదియాలేడేమో. కానీ, జీవితమనేది సక్రమంగా, సంతోషంగా సాగిపోతే ఆ దేవుడికే కాదు, విధికి కూడా చిన్న చూపు. అందుకే ఊహించని విధంగా ఓ కుటుంబానికి జీవితకాలపు దుఃఖాన్ని మిగిల్చింది. ముఖ్యంగా అమ్మ చేత జోలపాటలు పాడించుకొని, అమ్మ గోరుముద్దలు తిని పెరగాల్సిన ఓ చిన్నారికి.. మృత్యు రూపంలో శ్వాశ్వతంగా ఆ తల్లి దూరమయ్యే ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
నిర్మల్ జిల్లా ఖనాపూర్ పట్టణం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఓ కుటుంబంలో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. కూతురు బారసాల ముగిసిన గంటల వ్యవధిలోని ఓ తల్లి గుండెపోటుతో మృతి చెందింది. అయితే ఈ ఘటనలో మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖనాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మామిడాల రాజశేఖర్-శిరీష(28) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నారు. అయితే ఈ దంపతులకు ఇది వరకే ఓ కూమారుడు ఉండగా.. మరోసారి వీరికి ఓ కూతురు పుట్టింది. అయితే కూతురు పుట్టి 21 రోజులు కావడంతో.. ఆ చిన్నారికి గురువారం బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా తమ ఇంట్లో బారసాల నిర్వహించారు. ఇక ఆ రోజు రాత్రి వరకు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేసి, ఆనందోత్సాహాల మధ్య వేడుక ముగించుకొని అంతా నిద్రాలోకి జారుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆ కటుంబంలో ఆ ఆనందాలు, మధుర క్షణాలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
ఆ చిన్నారి తల్లి శిరీషకు అర్ధరాత్రి దాటాక ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యలు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శిరీష ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఆ కటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. శిరీష మరణాన్ని తట్టుకోలేని ఆ కుటుంబం గుండెలవిసేలా రోదించారు. ముఖ్యంగా శిరీష భర్త, కుటుంబం శోకసంధ్రంలోకి మునిగిపోయారు. అయితే బాలసార రోజునే చిన్నారికి ఆ తల్లి దూరమైన ఈ ఘటనకు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక శీరిష మృతదేహాన్ని శుక్రవారం రాత్రి ఖానాపూర్ తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.