iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం! పార్టీ పేరుతో సాప్ట్ వేర్ యువతిపై అత్యా*చారం!

  • Published Jul 30, 2024 | 7:30 PM Updated Updated Jul 30, 2024 | 7:30 PM

తాజాగా ఓ యువతి జాబ్ వచ్చిందనే ఆనందంతో తన చిన్ననాటి స్నేహితుడికి నగరంలోని ఓ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. కానీ, పార్టీకి వచ్చిన స్నేహితుడు ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డాడు.

తాజాగా ఓ యువతి జాబ్ వచ్చిందనే ఆనందంతో తన చిన్ననాటి స్నేహితుడికి నగరంలోని ఓ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. కానీ, పార్టీకి వచ్చిన స్నేహితుడు ఆ యువతిపై దారుణానికి పాల్పడ్డాడు.

  • Published Jul 30, 2024 | 7:30 PMUpdated Jul 30, 2024 | 7:30 PM
హైదరాబాద్ లో దారుణం! పార్టీ పేరుతో సాప్ట్ వేర్ యువతిపై అత్యా*చారం!

ఇటీవల కాలంలో మహిళపై దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల వరకు ఎవరిని వదిలి పెట్టాకుండా చాలా దారుణాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కిరాతుకులపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమలులోకి తెచ్చిన ఈ ఘోరాలను నిర్మూలించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే.. కామాంధులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతిపై తన తోటి స్నేహితుడు మరొకరు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో చిన్ననాటి స్నేహితుడికి  ఓ హోటల్ లో పార్టీ ఇవ్వగా.. ఈ నేపథ్యంలోనే ఆ యువతి అత్యాచారానికి గురైంది. అయితే ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా హైదరాబాద్ సిటీలోని ఓ హోటల్ లో యువతిపై ఇద్దరు యుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ యువతిని పార్టీ పేరుతో హోటల్ కు పిలిచి అత్యాచారం చేశారు. అయితే ఈ దారుణమైన ఘటన నేడు అనగా జూలై 30వ తేదీన ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. తనకు ఉద్యోగం వచ్చిందన్న  ఆనందంను తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పంచుకుంది. అయితే అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో సోమవారం (జూలై 29) రాత్రి 7.30 గంటల సమయంలో ఇద్దరూ కలిసి వనస్థలిపురం పరిధిలోని ఓంకార్ నగర్‌లో హైదరాబాద్-విజయవాడ హైవే సమీపంలోని బొమ్మరిల్లు హోటల్‌కు వచ్చారు. ఇక రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకొని, మద్యం తాగారు. ఆ తర్వాత కింది అంతస్తులో ఉన్న హోటల్ గదిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకొని చూడగా.. తన గదిలో గౌతంరెడ్డితో పాటు, మరో యువకుడు కూడా ఉన్నారు.

దీంతో తనపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకొని ఆ యువతి కేకలు వేయడంతో వాళ్లు భయపడి పారిపోయారు. ఇక బాధితురాలు ఓ స్నేహితురాలికి ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత ఆమె సాయంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇక తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆ యువతి పోలీసులకు కంప్లయింట్ చేసింది. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. దీంతో యువతి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే నిందితులను  పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss