iDreamPost
android-app
ios-app

కూతురికి కష్టం.. అమ్మకి నరకం! సమాజం తలదించుకునే ఘటన!

  • Published Apr 03, 2024 | 5:29 PM Updated Updated Apr 03, 2024 | 5:47 PM

దేశంలో రోజు రోజుకి వరకట్న వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అదనపు కట్నం కోసం.. అత్తింటి వేధింపులను తట్టులకోలేక ఓ మహిళ చేసిన పనికి ఒకే ఇంట్లో వరుసగా జరగరాని ఘోరం జరిగిపోయింది.

దేశంలో రోజు రోజుకి వరకట్న వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అదనపు కట్నం కోసం.. అత్తింటి వేధింపులను తట్టులకోలేక ఓ మహిళ చేసిన పనికి ఒకే ఇంట్లో వరుసగా జరగరాని ఘోరం జరిగిపోయింది.

  • Published Apr 03, 2024 | 5:29 PMUpdated Apr 03, 2024 | 5:47 PM
కూతురికి కష్టం.. అమ్మకి నరకం! సమాజం తలదించుకునే ఘటన!

దేశంలో రోజు రోజుకి వరకట్న వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసిన ఈ మధ్య అదనపు కట్న వేధింపులు తాళలేక మహిళలు ఆత్మహత్య చేసుకోవడం, హత్యకు గురవ్వడం వంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మొన్ననే ఉత్తరప్రదేశ్ లో అదనపు కట్నం ఇవ్వడం లేదని ఓ భర్త తన భార్యకు శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలు పెట్టాడంతో పాటు.. చివరికి కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను కొట్టి మరి హతమార్చారు. ఇక ఈ విషాధ ఘటన మరువక ముందే.. తాజాగా అదనపు కట్నం కోసం.. అత్తింటి వేధింపులను తట్టులకోలేక ఓ మహిళ తన ఏడాది బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకుంది.ఇక కూతురి మరణ వార్త తట్టుకోలేని మహిళ తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడంతో.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అదనపు కట్నం కోసం ఓ మహిళను తన అత్తింటివారు తీవ్ర వేధింపులకు గురి చేశారు. అయితే అత్తింటివేధింపులను తట్టుకోలేని ఆ మహిళ తన ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపడంతో పాటు.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అత్తింటి వేధింపులను తట్టుకోలేనక ఆత్మహత్య చేసుకున్న తన కూతురిని.. కాపాడలేకపోయననే బాధ మృతరాలి తల్లిని  చలించేలా చేసింది. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు, మనవడు ఈలోకం లేరని, తిరిగిరారనే బాధను తట్టుకోలేక  ఆ తల్లి సైతం.. ఆత్యహత్యకు పాల్పడింది. ఇలా ఒకరేజో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి చెందడంతో.. కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాగా, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు.. బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి, జయప్రద(55)ల చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్‌ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌కి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఏడాదిపాటు సక్రమంగా ఉన్న ఈ దంపతులకు ఆర్యన్‌(1) కొడుకు పుట్టాడు. ఇక కొడుకు పుట్టిన నుంచి నరేశ్ తన భార్య శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.

ఈక్రమంలోనే అత్తమామలు సుజాత, కేశవచారి కూడా కోడలు శ్రీజను హింసించడం మొదలు పెట్టారు. అయితే గత నెల 29న శ్రీజ బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. కాగా, ఈ మంగళవారం ఉదయం 6గంటలకు తమ కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్‌ చేయడంతో.. అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించా సాగారు. దీంతో మనస్తపానికి గురైన శ్రీజ జీవితం పై విరక్తి పుట్టి మాత్రలను తన కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తాను కూడా వేసుకుంది. ఇక అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను.. తల్లి జయప్రద వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏడాది బాబు మృతి చెందగా.. తల్లి శ్రీజ చికిత్స పొందుతూ మరణించింది. కూతురు, మనవడి మృతిని తట్టులేక తల్లి జయప్రద కూడా ఇంటికి వెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఇక ఈమెను కూడా ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో ఈమె కూడా మృతి చెందింది.